బాత్రూం శబ్దాలతో పకపకలు..
కొన్ని సందర్భాల్లో ఏమరపాటుతో ఉంటే నవ్వులపాలవడం ఖాయం. అలాంటి ఓ సంఘటనే టెక్సాస్‌లో జరిగింది. మేయర్ అధ్యక్షతన జార్జిటౌన్లో సమావేశం సీరియస్‌గా జరుగుతుండగా అందరూ ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. కౌన్సిలర్ రాచెల్ జోన్రో వ్యాధులకు సంబంధించిన విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాష్‌రూం శబ్దాలు బిగ్గరగా వినపడ్డాయి.
తీరా ఏం జరిగిందని చూసేసరికి అదే సమావేశంలో పాల్గొన్న ఓ కౌన్సిలర్ బాత్రూం వెళ్తూ తన మైక్రో ఫోన్‌ని ఆఫ్ చేయడం మరచిపోయినట్లు గ్రహించారు. ఇంకేముంది బాత్రూం శబ్దాలను విన్న ఆ కమిటీలోని సభ్యులందరూ ఎంతగా తమ నవ్వును ఆపుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అంతేకాకుండా టాయిలెట్లో ప్లష్ చేసిన శబ్ధం వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకున్న సౌండ్ రాకపోవడంతో...తమ సహచర సభ్యుడు చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోయి ఉంటుందనుకుంటూ బిగ్గరగా నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో యూ ట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది.