Formal
-
ఫ్యాషన్ టాక్: వెరైటీ చీరకట్టుతో కార్పోరేట్ లుక్ (ఫోటోలు)
-
ఆఫీస్‌లకి పర్ఫెక్ట్ చీరకట్టు ఇది..స్టైల్‌తో పాటు ఫార్మల్ కూడా
కుర్తాసెట్ ధరించిన సౌకర్యం కావాలి. సంప్రదాయం కాకుండా స్టయిలిష్‌గా కనిపించాలి. క్యాజువల్ వేర్ అనిపించాలి.కార్పొరేట్ లుక్‌తో ఆకట్టుకోవాలి. ఇవన్నీ ఒకచోట కొలువుండాలంటే ఎవర్గ్రీన్ చీరకట్టును మోడర్న్‌గా మెరిపించాలి. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాంగ్ బ్లౌజ్‌లు, ఓవర్‌కోట్స్, పెప్లమ్, షర్ట్ స్టైల్... ఇలాంటి వాటితో కాటన్ లేదా సిల్క్ చీరకట్టును మ్యాచ్ చేస్తే స్టయిల్ లుక్ సొంతం కాకుండా ఉండదు. కాటన్, సిల్క్, బెనారస్ డిజైనర్ టాప్స్‌తో తీసుకువచ్చే ఈ లుక్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ ఆకట్టుకుంటుంది. -
ఇకపై నో జీన్స్, నో టీ షర్ట్స్.. సీబీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కార్యాలయంలోని అధికారులు జీన్స్, టీషర్ట్స్,స్పోర్ట్స్ షూస్, వేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఇకనుంచి ప్రతీ ఒక్కరూ వీటిని పాటించాలన్నారు. దీని ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు ఇకపై షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. అలాగే నీట్‌గా షేవ్ చేసుకోవాలి. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకొని కార్యాలయాలకు రావాలి. ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల అధిపతులకు తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?