The formation of new districts
-
ఈఈలే జిల్లా అధికారులు
భూపాలపల్లికి ములుగు పీఆర్, ఐబీ, ఆర్అండ్బీ డివిజన్లు వరంగల్‌కు ఏటూరునాగారం స్పెషల్ ఎంఐ డివిజన్ వరంగల్ : నూతన జిల్లాల ఇంజనీరింగ్ శాఖలకు ఆయా విభాగాల ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(ఈఈ)లే జిల్లా స్థాయి అధికారులుగా వ్యవహరించనున్నారు. రహదారులు–భవనాలు, (ఆర్అండ్బీ), పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయాలు కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జిల్లా కేంద్రం లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ ఎస్ఈ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా ఎస్ఈ కార్యాలయాల ఏర్పాటు లేకపోవడంతో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అధికారులే జిల్లా ఉన్నతాధికారులు కానున్నారు. పీఆర్ ఇంజనీరింగ్ జిల్లాలో మహబూబాబాద్, ములుగు, వరంగల్ పీఆర్ఐ డివిజన్లతోపాటు వరంగల్‌లో మరో పీఐ యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ములుగు పీఆర్ డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి తరలించనున్నారు. వరంగల్‌లో ఉన్న రెండు డివిజన్లు ఒక్కో జిల్లాలో పనులు పర్యవేక్షించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు పర్యవేక్షించే పీఐయూ డివిజన్ జిల్లాల ఏర్పాటులో పీఆర్ఐగా మారనుంది. భవిష్యత్తులో ఎస్ఈ పరిధి కేంద్ర ప్రభు త్వ పథకాల పర్యవేక్షణకు మరో డివిజన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నీటి పారుదల శాఖ జిల్లాలో చిన్ననీటి పారుదల విభాగంలో వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారంలో స్పెషల్ ఎంఐ డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. ములుగు డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి, ఏటూరునాగారం స్పెషల్ ఎంఐ డివిజన్ జిల్లా కేంద్రానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. గిరిజన ప్రాంతాల్లో పనుల పర్యవేక్షణకు ఏర్పడిన స్పెషల్ ఎంఐ డివిజన్ మాయం కానుంది. దీంతో నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనులను ఐటీడీఏ పర్యవేక్షించే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో వరంగల్, హన్మకొండ డివిజన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నాయి. కొత్త జిల్లాల్లో రెండు కొత్త డివిజన్లను మహబూబాబాద్, భూపాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం పరిధిలో పనుల పర్యవేక్షణకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున 10 సబ్ డివిజన్లు ప్రస్తుతం ఉన్నాయి. వీటిని 7 సబ్ డివిజన్లకు కుదించనున్నారు. వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, మంథని డివిజన్లు ఉండగా కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఒక్కో సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేసి ఆర్డబ్ల్యూఎస్ పనులు పర్యవేక్షించేలా అధికారులు ప్రతిపాదించారు. రహదారులు.. భవనాల శాఖ రహదారులు–భవనాల శాఖలో వరంగల్, ములుగు, మహబూబాబాద్ ఇంజనీరింగ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో డివిజన్ కార్యాలయాలు ఉండగా ములుగు డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న మరో జిల్లాపై స్పష్టత వస్తే రూరల్(కాకతీయ) జిల్లాలో మరో డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యాలయాలు దసరా నుంచి పనిచేసేలా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను ఆయా శాఖల ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. మార్పులు లేని మిషన్ భగీరథ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ను అమలులోకి తెచ్చింది. మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం పరిధిలో పరకాల, మహబూబాబాద్, వరంగల్, జనగామ డివిజన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మిషన్ భగీరథ ప్రాముఖ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డివిజన్లు ప్రస్తుతం యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
‘ములుగు’ను పరిగణనలోకి తీసుకోవాలి
సీఎస్ రాజీవ్‌శర్మకు మంత్రి చందూలాల్ వినతి ములుగు : నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ములుగు జిల్లా అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతిపత్రం అందించారు. గురువారం హైద్రాబాద్‌లోని సీఎస్ కార్యాలయంలో ఆయనను కలిసి ములుగు జిల్లా మ్యాప్‌ను వివరించారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ములుగును సమ్మక్క–సారలమ్మ దేవతల పేరిట జిల్లా కేంద్రంగా చేయాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. గిరిజన ఆదివాసీల మనోభావాలకు అనుగుణంగా ములుగు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, భద్రాచలం నియోజకవర్గాల్లోని 21 మండలాలను కలుపుతూ ములుగు కే ంద్రంగా జిల్లాగా చేస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. త్వరలో కేసీఆర్‌కు కూడా వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు బండారి మోహన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
కొత్త జిల్లా.. లేనట్టేనా!
ప్రకటన చేయని ముఖ్యమంత్రి ‘భూపాలపల్లి’ విజ్ఞప్తిపై కానరాని స్పందన ఇతర ప్రాంతాలపైనా ఇదే తీరు వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడంతో భౌగోళికంగా ఎలాంటి మార్పులు ఉంటాయనేది కొన్ని నెలలుగా ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు భూపాలపల్లి కేంద్రంగా ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అరుుతే, సీఎం కేసీఆర్ ఈ నెల 5న భూపాలపల్లి నియోజకవర్గంలోని చెల్పూరుకు వచ్చిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో.. భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారి సీఎంకు విజ్ఞప్తి చేశారు. అరుునప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయలేదు. గత ఏడాది జనవరిలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో నాలుగు రోజులు పర్యటించారు. ఆ పర్యటనలో ఒక రోజు భూపాలపల్లికి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా జిల్లా ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. ఇలా.. రెండుసార్లు భూపాలపల్లికి వచ్చినా జిల్లా ఏర్పాటుపై సీఎం ప్రకటన చేయకపోవడంతో ఆ ప్రాంత వాసుల్లో సందేహాలు కలుగుతున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు ఉంటుం దా లేదా అనేది విషయంలో అయోమయం నెలకొంది. కొత్త జిల్లా ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ అన్ని జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, కొత్త జిల్లాల ఆవశ్యకతను పరిశీలిస్తోంది. మన జిల్లా భౌగోళికంగా పెద్దగానే ఉంది. జిల్లా విస్తీర్ణం 12,846 చదరపు కిలో మీటర్లు. జిల్లాలో 35,12,576 జనాభా ఉంది. విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దగా ఉండడంతో మన జిల్లాలోనూ మార్పులు జరగనున్నాయి. అరుుతే, ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. సింగరేణి ప్రాంతాన్ని కలుపుతూ భూపాలపల్లి కేంద్రంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జిల్లా ఏర్పాటవుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లా కేంద్రం ఉండాలనే డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమం జరుగుతోంది. జిల్లాలో మొదటి మున్సిపాలిటీగా ఉన్న జనగామ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోవైపు ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్లు పెరుగుతుండగా.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
కొత్త నియోజకవర్గాలా... జిల్లాలా?
పునర్విభజనపై తర్జనభర్జన నియోజకవర్గాల తర్వాతే: సీఎం కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లాకు 5 నియోజకవర్గాల చొప్పునలో మొత్తం 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దాని ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేస్తే పలు సమస్యలు వస్తాయని ‘సాక్షి’ ముందుగానే విశ్లేషిం చింది. సీఎం కేసీఆర్ కూడా జిల్లాల పునర్విభజ న అంశం ఇప్పుడే లేదని శుక్రవారం తేల్చేశారు. ఏది ముందు? కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తే భౌగోళికంగా, రాజ్యాంగపరంగానే కాకుండా రాజకీయంగా కూడా పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కొక్క లోక్‌సభా నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున 17 లోక్‌సభా స్థానాల్లో తెలంగాణ అసెంబ్లీకి మరో 34 నియోజకవర్గాలు పెరుగనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం దీనిని 2019 ఎన్నికల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. ఒక మండలం ఒకే నియోజకవర్గంలో ఉండాలి. ఒక నియోజకవర్గం ఒకే జి ల్లాలో ఉండాలి. జనాభా సగటులో 5-10 శాతం దాకా హెచ్చుతగ్గులున్నా మిగిలిన విషయాల్లో మార్గదర్శకాలను అనుసరించాలి. జిల్లాల పునర్విభజన తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే పలు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఒక జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాలు, మండలాలు వేరేదానిలో కలపాల్సి రావొచ్చు. కొత్త సమస్యలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజన ఇప్పుడప్పుడే సాధ్యం కాదని ‘సాక్షి’ విశ్లేషించింది. దీనికి తోడు స్థానిక నైసర్గిక, భౌగోళిక పరిస్థితుల మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల నుండి కొన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. విభజన అనేది అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయంగా ఇబ్బందులే తెస్తుందని గతంలో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. అందుకని జిల్లాల పునర్విభజనను వీలైనంత కాలం వాయిదా వేయాలనే ఆలోచనలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. ‘తెలంగాణను విభజించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా?,సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. గతంలో ఎన్డీయే ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగా ఎంత లాభం జరిగింది? దానికి అనుగుణంగానే జిల్లాల విభజన విషయంలోనూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అదే వ్యూహాన్ని అనుసరించొచ్చు’ అని అదే పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు విశ్లేషించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.‘నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పూర్తి అయిన తర్వాతనే నూతన జిల్లాల ఏర్పాటు విషయం తెరమీదకు వస్తుంది. జిల్లాల ఏర్పాటుపై ఇప్పుడు వస్తున్న వార్తలను నమ్మవద్దు’ అని ఆయన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. -
కొత్త జిల్లాలపై కసరత్తు షురూ!
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చ జిల్లా పరిధి ఐదు అసెంబ్లీ లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గం దశలవారీగా ప్రక్రియ చేపట్టాలని యోచన హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 24 జిల్లాలకు పెంచుతామని కేసీఆర్ ఎన్నికల ప్రచార సమయంలోనూ వెల్లడించిన విషయం విదితమే. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహిం చిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చించారు. కొత్తగా ఏర్పాటుచేయాలనుకున్న జిల్లా కేంద్రాలపై సాధ్యాసాధ్యాల నివేదికను తెప్పించుకోవాలని ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2019లో పునర్వ్యవస్థీకరణ అనంతరం జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ జిల్లాల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి కొత్తగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి కసరత్తు అనంతరమే ఈ జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. శుక్రవారం జరిగిన సమావేశం కేవలం ప్రాథమిక సమావేశమేనని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఒకేసారి కాకుండా దశలవారీగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్లతో సమావేశం.. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల తొలిదశ బడ్జెట్ కసరత్తు పూర్తయింది. కొంతమంది టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆయా టాస్క్‌ఫోర్స్ కమిటీలు రూపొందించిన నివేదికలను కేసీఆర్‌కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో టాస్క్‌ఫోర్స్ కమిటీల నివేదికలను పరిగణ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. వాటర్‌గ్రిడ్‌పై.... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్‌పై గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఇంజనీర్లతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650కి పైగా ఇంజనీర్లతో హైదరాబాద్‌లో ఒకరోజు సమావేశం నిర్వహించి.. వారికి వాటర్‌గ్రిడ్‌పై పూర్తిగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.