జయలలిత ఫొటో తొలగింపు
* అధికారులతో వాగ్వాదానికి దిగిన
* అన్నాడీఎంకే నేతలు
తిరువళ్లూరు: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను అధికారులు తొలగించడం వివాదస్పదమైంది. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు నగర అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రిజిస్ట్ట్రార్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తిరువళ్లూరులోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఫొటోను అధికారులు వారం క్రింతం తొలగించారు.
జయ ఫొటో స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఫొటోను తగిలించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారం ఆలస్యంగా అన్నాడీఎంకే నేతలకు తెలిసింది. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కారణం లేకుండా జయ ఫొటోను ఎందుకు తొలగించారని రిజిస్టర్ కార్యాలయ అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళా ఉద్యోగులు భ యాందోళన చెందారు.
విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్నాడీఎంకే నేతల తో చర్చించారు. విషయాన్ని పెద్దది చేయవద్దని విజ్ఞ ప్తి చేశారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న జయలలిత ఫొటోను కార్యకర్తలు తిరిగి తగిలించారు. ఈ వ్యవహారం జిల్లా వాప్తంగా సంచలనం కలిగించింది.