Former Deputy Chief
-
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
కోతల.. కూతల ప్రభుత్వం
అలంపూర్: టీఆర్ఎస్ కోతల.. కూతల ప్రభుత్వమని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రైతు ఘోషపట్టడం లేదన్నారు. అప్పులబాధతో ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. శుక్రవారం ఆయన దక్షిణకాశీ అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రేషన్‌కార్డులు, వృద్ధాప్య, వితంతువుల, వికలాంగుల పింఛన్లలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ఒక జిల్లాను సింగపూర్, మరో జిల్లాను మలేషియాలా, ఇంకొక జిల్లాను న్యూయార్క్‌లా మారుస్తానని మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. అసలు ప్రభుత్వానికి దశదిశా ఉందా..? అని ప్రశ్నించారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షలు కేటాయిస్తామని చెప్పారని, వీటికి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడున్నాయని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పట్ల ఒక్క మంత్రి కూడా స్పందించడం లేదన్నారు. కేసీఆర్‌కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని.. సభా మర్యాదలను పాటించడం లేదని ఆరోపించారు. ఉద్యమపార్టీగా చెప్పుకుని టీఆర్ఎస్లోకి వలసను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న వారిలో 30శాతం ఉద్యమకారులు ఉంటే 70 శాతం వలసవాదులే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు స్ఫూర్తిదాయమని, అలాంటి వారినే కేసీఆర్ విస్మరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, అసలు సిద్ధాంతమే లేదన్నారు. ఆయన వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ నాయకులు ఉన్నారు. జోగుళాంబ మాతనే రాష్ట్రాన్ని కాపాడాలి తెలంగాణ రాష్ట్రాన్ని జోగుళాంబ మాతనే కాపాడాలని ప్రార్థించినట్లు మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు.దక్షిణకాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఆయన శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్పర్సన్ లక్ష్మి అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు జరిపించారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట మాజీ మంత్రులు ప్రసాద్, చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పీసీసీ నేతలు అద్దంకి ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.