Former Karnataka Chief Minister
-
యడ్యూరప్పకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్నాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. పోస్కో చట్టం కింద నమోదైన కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట ఈనెల 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేత, 81 ఏళ్ల యడ్యూరప్పను హైకోర్టు ఆదేశించింది. -
యడియూరప్పపై పోక్సో కేసు
సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు. పోలీసులు డాలర్స్ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్ మోహన్ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్ కమిషనర్ దయానందతో ఫోన్లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు. -
Karnataka assembly elections 2023: టికెటివ్వకుంటే పాతిక సీట్లు గోవిందా
హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టార్ ధిక్కారస్వరం వినిపించారు. ‘హూబ్లీ–ధార్వాద్ సెంట్రల్ టికెట్ నాకివ్వాల్సిందే. లేదంటే ఈసారి ఎన్నికల్లో పార్టీ 20 నుంచి 25 స్థానాల్లో ఓటమిని చవిచూస్తుంది’ అని షెట్టార్ శనివారం వ్యాఖ్యానించారు. నవ తరం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీచేయొద్దని సూచించింది. అలా షెట్టార్‌కు ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీనిని బేభాతరు చేస్తూ ధిక్కార స్వరం వినిపించారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లికి వచ్చి షెట్టార్తో మంతనాలు జరిపారు. అయినా సరే వినని షెట్టార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ సిట్టింగ్‌లను పక్కనబెడితే ఆ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడకూడదు. ఒకవేళ పడితే అది ఆ ఒక్క స్థానానికే పరిమితం కాదు. ఉత్తర కర్ణాటకలో కనీసం 20–25 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదముంది. ఈ మాట గతంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా చెప్పారు. వేచి చూస్తా. నాకు టికెట్ ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తా’ అని అన్నారు.