former PM PV Narsinha Rao
-
ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో శనివారం ఆవిష్కరించారు. ఆ దేశ రాజధాని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె వాణీదేవి, ఎన్ఆర్ఐ ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల, అక్కడి నగర మేయర్ మాథ్యూ బ్లాక్మెర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, హార్న్ కౌన్సిలర్ శ్రీని పిల్లమర్రితో కలిసి ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహం తరువాత ప్రతిష్ఠించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీదే కావడం గమనార్హం. భారతదేశ పాలనావ్యవస్థలో అనేక మార్పులు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యుదయానికి పీవీ పాటుపడ్డారని పలువురు వక్తలు కొనియాడారు. పీవీ సంస్కరణల ఫలితాలను, ప్రయోజనాలను ప్రస్తుతం భారత్ ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ హేమచందర్‌రావు కల్వకోట, సుజాత కల్వకోట, భారతి, విజయ హాజరయ్యారు. ఇదీ చదవండి: యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్ -
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి
పీవీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు సాక్షి, హైదరాబాద్: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని గట్టెక్కించడంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేసిన కృషి అద్వితీయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. పీవీ 11వ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు ప్రపంచం గర్వించదగిన మేధావి అని కొనియాడారు. అనంతరం పీవీ ఘాట్‌కు వెళ్లి ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. కాగా ఇందిరాభవన్‌లో ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు పీవీ నర్సింహారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. దేశం ఆర్థికంగా ఎదగడానికి పీవీ తెచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. కార్యక్రమంలో ఏపీ మండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు.