ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి | Congress leaders solid tribute to PV | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి

Published Thu, Dec 24 2015 12:46 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి - Sakshi

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మేధావి

పీవీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
 సాక్షి, హైదరాబాద్: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని గట్టెక్కించడంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేసిన కృషి అద్వితీయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. పీవీ  11వ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు ప్రపంచం గర్వించదగిన మేధావి అని కొనియాడారు. అనంతరం పీవీ ఘాట్‌కు వెళ్లి ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు.

కాగా ఇందిరాభవన్‌లో ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు పీవీ నర్సింహారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. దేశం ఆర్థికంగా ఎదగడానికి పీవీ తెచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. కార్యక్రమంలో ఏపీ మండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement