కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు దిలీప్‌గాంధీ (70) కరోనాతో బాధ పడుతూ బుధవారం కన్నుమూశారు. మంగళవారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస తీసుకున్నారు. దిలీప్‌గాంధీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు.
అహ్మద్‌నగర్ దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన దిలీప్ గాంధీ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1999లో ఆ తరువాత 2009, 2014లో మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా కేంద్ర ఆరోగ్యం శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 28,903 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 188 మరణాలు సంభవించాయి. (మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి)
Saddened by the demise of former MP and Minister Shri Dilip Gandhi Ji. He will be remembered for his rich contributions to community service and helping the poor. He made numerous efforts to strengthen the BJP in Maharashtra. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) March 17, 2021