కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత | Dilip Gandhi, Former Union Minister Dies Due To COVID-19 | Sakshi
Sakshi News home page

కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Published Wed, Mar 17 2021 10:08 AM | Last Updated on Wed, Mar 17 2021 11:05 AM

Dilip Gandhi, Former Union Minister Dies Due To COVID-19 - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌  వేవ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు  దిలీప్‌గాంధీ (70)  కరోనాతో బాధ పడుతూ బుధవారం కన్నుమూశారు. మంగళవారం  కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస తీసుకున్నారు.  దిలీప్‌గాంధీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ట్విటర్‌ ద్వారా  విచారం వ్యక్తం  చేశారు.

అహ్మద్‌నగర్ దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన దిలీప్ గాంధీ  దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1999లో  ఆ తరువాత  2009,  2014లో మూడుసార్లు ఎంపీగా  ఎన్నికయ్యారు. కాగా కేంద్ర ఆరోగ్యం శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 28,903 కొత్త  కరోనా కేసులు నమోదు కాగా 188 మరణాలు సంభవించాయి.   (మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement