Foundation ceremony
-
దేశంలోనే మనది నెంబర్ వన్ సిటీ: కేటీఆర్
బాలానగర్: ‘దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రేటర్ నగరం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ప్రజలు నగరం నలుమూలలకు తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఎంసీహెచ్ 150 నుంచి 160 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండేదని, జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత నగరం 625 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 1950 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పన్నమవుతోందని, దీనిలో 94 శాతం మురుగు నీరు గ్రావిటి ద్వారా మూసీనదిలోకి వెళుతుందని పేర్కొన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భోలక్‌పూర్‌లో మంచినీరు కలుషతిమై 9 మంది చనిపోయారని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని అన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘మూసీ నదిని జీవనదిగా మార్చాలి. మన నగరాన్ని విశ్వనగరంగా మార్చాలి. ఇందుకు అందరూ సహకరించాలి’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలు నాలాలు, మురికి కాల్వల్లో చెత్తను వేయవద్దని చెప్పారు. మనందరం కలిసి మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందిద్దాం అన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే నియోజకవర్గంలోని 9 చెరువులకు నిధులు మంజూరు చేశారని కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్, శిరీష బాబురావు, సబిహా బేగం, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
27 చెట్లు.. ఇనుము వాడకుండా నిర్మాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం భూమి పూజ ఆగస్టు 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో మందిరంలో మూడు అంతుస్తులు ఉండనున్నట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లుగా నిర్మాణం జరగనుంది. ప్రతిపాదిత రామమందిరాన్ని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండగా.. మిగిలిన 57 ఎకరాలను రామ్ టెంపుల్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ సముదాయంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు. ఒక్కొ నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 27 మొక్కలను నాటనున్నారు. నక్షత్ర వాటిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాలు తమ పుట్టిన రోజునాడు వారి జన్మ నక్షత్రం ప్రకారం ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం ఉండనుంది. ఇనుము లేకుండా నిర్మాణం ఆలయ పునాది 15 అడుగుల లోతులో ఉంటుంది. ఇది 8 పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొర 2 అడుగుల వెడల్పు ఉంటుంది. పునాది వేదికను సిద్ధం చేయడానికి కాంక్రీట్, మోరాంగ్‌ను వాడనున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదు. అంతేకాక వాల్మీకి రామాయణంలో పేర్కొన్న చెట్లను రామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నాటనున్నారు. ఈ ప్రాంతానికి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా పేరు పెడతారు. మందిరం భూమి పూజ తర్వాత రామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో శేషవతార్ ఆలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ట్రస్ట్ ప్రతిపాదించింది. మందిర నిర్మాణం ముగిసిన తర్వాత శేషవతార్ శాశ్వత నిర్మణాన్ని చేపడతారు. రాముడి పుట్టుక నుంచి అవతారం ముగిసేవరకు జరిగిన పలు అంశాలతో ‘రామ్ కథా కుంజ్ పార్క్’ నిర్మాణం కూడా జరగనుంది. అలానే మందిరం తవ్వకాలలో లభించిన అవశేషాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు గోశాల, ధర్మశాల, ఇతర దేవాలయాల సముదాయాలు కూడా ఇక్కడ నిర్మిస్తారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) మందిరం ఎత్తు మరో 20 అడుగులు పెంపు మందిరం భూమి పూజ కోసం రాగి పలకను సిద్ధం చేస్తున్నారు. దీని మీద ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా ఆలయం పేరు, ప్రదేశం, సమయం ఈ పలకపై సంస్కృతంలో చెక్కుతారు. 1988లో ప్రతిపాదించిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎత్తు 161 అడుగులు. అయితే ప్రస్తుతం దాన్ని మరో 20 అడుగులు పెంచినట్లు ఆలయ ప్రధాన వాస్తు శిల్పి సి సోంపురా కుమారుడు నిఖిల్ సోంపురా తెలిపారు. ఆగస్టు 5న జరగనున్న మందిర భూమి పూజ కోసం గంగా, యమున, సరస్వతి నదులు సంగమ క్షేత్రం అయిన త్రివేణి సంగమం నుంచి నీరు, మట్టి తీసుకెళ్లాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది. రామ్ మందిర్ ఉద్యమంలో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పలువురు సాధువులు ప్రముఖ పాత్ర పోషించినందున.. అయోధ్యలో భూమి పూజ జరిగే రోజున వివిధ మఠాలు, దేవాలయాల్లో వేడుకలు జరుగుతాయని వీహెచ్‌పీ ప్రతినిధి అశ్వని మిశ్రా తెలిపారు. (మందిర నిర్మాణంపై పవార్ కీలక వ్యాఖ్యలు) భూమి పూజ నాడు దీపాలు వెలిగించాలి ఆగస్టు 5 న సాయంత్రం తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని వీహెచ్‌పీ హిందువులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా వీక్షకులు, సాధువులు శంఖం పూరిస్తారని అశ్వని మిశ్రా తెలిపారు. ఆగస్టు 5న ఆలయానికి పునాదిరాయి వేయాలని ట్రస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించింది. -
వచ్చే నెల్లో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
కావలి: దగదర్తి మండలం దామవరం వద్ద ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టుకు వచ్చే నెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన ఎయిర్‌పోర్టు భూములపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దామవరం, కొత్తపల్లి కౌరగుంట గ్రామాల్లో ఇంతవరకు 1,399 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. ఈ భూముల్లో ప్రభుత్వ భూములకు సంబంధించి పరిహారం చెల్లించామని, ఇకపోతే పట్టా భూములకు ఎంత ధర నిర్ణయించాలో అనే విషయంపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు. 20 రోజుల్లో ఈ ప్రక్రియ ముగించి వచ్చే నెల చివరిలో శంకుస్థాపనకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. మళ్లీ రెండు సార్లు ఈ భూముల వ్యవహారంలో సమీక్ష నిర్వహిస్తాన్నారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, ఆర్డీఓ ఎస్ఎల్ నరసింహంతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయం మా దృష్టికి రాలేదు కావలిలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం భూములు సేకరిస్తున్నారా అంటూ ‘సాక్షి’ కలెక్టర్‌ను ప్రశ్నిస్తే అలాంటివేమీ తమ దృష్టికి రాలేదని కలెక్టర్ ముత్యాలారాజు స్పష్టం చేశారు. 13 వందల ఎకరాలు అనధికారికంగా గుర్తించినట్లు ప్రచారం సాగుతుందని అడిగితే అంతా పుకార్లేనని, ఈ విషయమై ప్రభుత్వాలనుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. -
నూతన రాజధాని భూమిపూజకు స్థలం ఎంపిక
గుంటూరు :ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమి పూజకు స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ శనివారం ఎంపిక చేశారు. తుళ్లూరు మండలంలోని మందడం, తాళ్లాయపాలెం మధ్య తుళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రకు చెందిన 25 ఎకరాల స్థలంలో భూమిపూజ చేయాలని నిర్ణయించారు. జూన్ 6వ తేదీన ఉదయం ఎనిమిది గంటల 49 నిమిషాలకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. స్థలాన్ని కమిషనర్‌తో పాటు జేసీ శ్రీధర్ , ఎమ్మెల్యే శ్రావణ్ పరిశీలించారు.