four wrestlers
-
రెజ్లింగ్ లో భారత్ కు మరో రెండు స్వర్ణాలు
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు బబిత కుమారి, యోగీశ్వర్ దత్ లు పసిడి పతకాలను కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటారు. తొలుత మహిళల 55 కేజీల విభాగంలో బబిత కుమారి అద్యంతం ఆకట్టుకుని బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెనడాకు చెందిన బ్రిట్టేన్నీ లెవర్ డ్యూర్ పై ఒడిసి పట్టుకుని స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇదిలా ఉండగా 65 కేజీల విభాగంలో భారత్ ఆటగాడు యోగేశ్వర్ దత్ పసిడిని చేజిక్కించుకున్నాడు. కెనాడాకు చెందిన రెజ్లర్ జెవోన్ బాల్ ఫోర్ పై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే గీతికా జఖర్ మాత్రం ఫైనల్ రౌండ్ లో నిరాశ పరిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ రెజ్లింగ్ లో ఐదు బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ మొత్తం మీద 12 బంగారు పతకాలను కైవసం చేసుకుని అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. -
రెజ్లింగ్ లో భారత్ కు పతకాల పంట
గ్లాస్గో:కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2014 లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో భారత్ రెజ్లర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్ రౌండ్ లో భారత్ క్రీడాకారులు అమిత్ కుమార్, సుశీల్ కుమార్, వినేష్ పొగట్ లు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. తొలుత 57 కిలోల విభాగంలొ భారత్ ఆటగాడు అమిత్ కుమార్ తన ప్రత్యర్ధి నైజీరియా ఆటగాడు ఎబిక్ వెమినోవాపై విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా 48 కిలోల మహిళల విభాగంలో భారత్ క్రీడాకారిణి వినేష్ పొగాట్.. ఇంగ్లండ్ క్రీడాకారిణి యానాపై విజయం సాధించి పసిడిని తన ఖాతాలో వేసుకుంది. మరో భారత్ ఆటగాడు సుశీల్ కుమార్ 74 కిలోల విభాగంలో తన సమీప ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాడు అబ్బాస్ ను మట్టికరిపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే 124 కిలోల విభాగంలో రాజీవ్ తోమర్ మాత్రం కెనడా ఆటగాడు కోరీ జార్విస్ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా పతకాలతో 10 పసిడిలను తన ఖాతాలో వేసుకున్న భారత్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. -
భారత రెజ్లర్ల హవా మొదలైంది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు కొల్లగొడుతున్న భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లకు రెజ్లర్లు తోడయ్యారు. మంగళవారం నలుగురు భారత రెజ్లర్లు పతకాలు ఖాయం చేసుకున్నారు. సుశీల్ కుమార్, అమిత్ కుమార్, రాజీవ్ తోమర్, వినేష్ పొగట్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పసిడి పతకాలకు అడుగు దూరంలో నిలిచారు. సెమీస్‌లో 74 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో సుశీల్ కుమార్, 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో అమిత్, 125 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో రాజీవ్ విజయం సాధించారు. ఇక మహిళల 48 కిలోల విభాగం సెమీస్‌లో వినేష్ పొగట్ గెలుపొందింది. ఫైనల్స్ ఇదే రోజు జరగనున్నాయి.