కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు కొల్లగొడుతున్న భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లకు రెజ్లర్లు తోడయ్యారు.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు కొల్లగొడుతున్న భారత షూటర్లు, వెయిట్ లిఫ్టర్లకు రెజ్లర్లు తోడయ్యారు. మంగళవారం నలుగురు భారత రెజ్లర్లు పతకాలు ఖాయం చేసుకున్నారు. సుశీల్ కుమార్, అమిత్ కుమార్, రాజీవ్ తోమర్, వినేష్ పొగట్ ఫైనల్కు దూసుకెళ్లారు. పసిడి పతకాలకు అడుగు దూరంలో నిలిచారు.
సెమీస్లో 74 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో సుశీల్ కుమార్, 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో అమిత్, 125 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో రాజీవ్ విజయం సాధించారు. ఇక మహిళల 48 కిలోల విభాగం సెమీస్లో వినేష్ పొగట్ గెలుపొందింది. ఫైనల్స్ ఇదే రోజు జరగనున్నాయి.