four year boy
-
Dogs Attack: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి
మలక్‌పేట: నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మలక్‌పేటలోని మూసారంబాగ్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్ కుమార్‌పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తాను ఇంట్లోంచి బయటి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవి కావని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం ఈ ఘటన తీవ్రతకు అద్దంపడుతోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయికుమార్, అలేఖ్య దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మూసారంబాగ్లో నివాసం ఉంటున్నారు.వీరికి ఉజ్వల్‌కుమార్ (4), ఆరు నెలల వయసున్న మరో బాబు ఉన్నారు. శనివారం సాయంత్రం చిన్న కుమారుడికి అలేఖ్య పాలు తాపుతుండగా.. ఉజ్వల్‌కుమార్ నిద్ర లేచి అపార్ట్మెంట్ గేట్ వైపు వెళ్తుండగా వీధి కుక్కలు వచ్చి అతనిపై దాడిచేశాయి. మొదట కుడికాలు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి బాలుడి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు గట్టిగా ఏడ్వడంతో గదిలోంచి తల్లి బయటికి వచి్చంది. అప్పటికే కుక్కలు బాలుడిని కరుస్తున్నాయి.ఆమె కేకలు వేస్తూ వాటిని కట్టెతో కొట్టి వెళ్లగొట్టింది. బాలుడి ముఖంపై, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఒళ్లంతా రక్తంతో తడిసి పోయింది. చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉజ్వల్‌కుమార్ ముఖానికి వైద్యులు చికిత్స చేశారని, 10 కుట్లు వేశారని తండ్రి సాయికుమార్ తెలిపారు. గది నుంచి బయటికి రావడం ఆలస్యమైతే తమ కొడుకును కుక్కలు చంపేసి ఉండేవని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. -
పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు
అబుదాబి: పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు. -
తల్లిని షూట్ చేసిన నాలుగేళ్ల బాలుడు!
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడి గన్‌కల్చర్ ఎలాంటి అనర్థాలకు కారణమౌతుందో చెప్పె ఘటన ఇది. కారులో వెనుక సీట్లో కూర్చున్న ఓ నాలుగేళ్ల బాలుడు.. డ్రైవింగ్ చేస్తున్న తల్లిని వెనుక నుండి షూట్ చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాక్స్విల్లే ప్రాంతానికి చెందిన జేమీ గిల్ట్ వృత్తి రిత్యా న్యాయవాది. మంగళవారం ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో పుట్నం కౌంటీ ప్రాంతంలో కారులో వెళ్తుంది. ఆ సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్న బాలుడు అక్కడే ఉన్న హ్యండ్ గన్ను చేతిలో పట్టుకొని ఆడుతూ అనుకోకుండానే ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో బుల్లెట్ జేమీ వీపు భాగం నుంచి దూసుకెళ్లింది. జేమీని ప్రాణాపాయ స్థితిలో గమనించిన అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే.. టార్గెట్‌ను షూట్ చేస్తున్నాడంటూ తన కుమారుడి షూటింగ్ ప్రతిభను మెచ్చుకొంటూ జేమీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేయడం విశేషం. జేమీ ఉదంతంతో గన్‌కల్చర్‌పై సోషల్ మీడియాలో మరోసారి భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం
గుర్గావ్: హర్యానాలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై ఓ టీనేజీ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్లో నివసించే నాలుగేళ్ల బాలుడిపై పదిహేనేళ్ల కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొరుగింట్లో ఉండే యువకుడు ఒంటరిగా ఉన్న బాలున్ని ప్రలోభపెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యాచారానికి గురైన బాలుడి సోదరుడితో నిందితుడు చనువుగా ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లి పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం బయటకు రావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిపై లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.