fourth season
-
గోల్డ్ బాండ్ ధర రూ.3,890
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 నాల్గవ సిరీస్ సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం 13వ తేదీ వరకూ చందాదారులకు అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం- గోల్డ్ బాండ్ ధర గ్రాముకు రూ.3,890. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే వీరికి గోల్డ్ బాండ్ రూ.3,840కే లభిస్తుందన్నమాట. లేదంటే నిర్దేశిత బ్యాంక్ బ్రాంచీలు, పోస్టాఫీసుల ద్వారా గోల్డ్ బాండ్లకు చందాదారులు కావచ్చు. 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గించి, ఈ కొనుగోళ్ల మొత్తంలో కొంత మొత్తం పొదుపుల్లోకి మళ్లించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. గ్రాము నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) 500 గ్రాముల వరకూ పసిడి కొనుగోళ్లకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుంటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు సంబంధిత సంస్థలు 20 కేజీల వరకూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. -
పట్నా కూడా సెమీస్‌లోకి..
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ కూడా సెమీఫైనల్లోకి చేరింది. శనివారం పుణెరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 31-28 తేడాతో నెగ్గడమే కాకుం డా 47 పాయింట్లతో జైపూర్‌ను వెనక్కినెట్టి టాప్కు చేరింది. పట్నా ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రదీప్ నర్వాల్ అద్భుత రైడింగ్‌తో 12 పాయింట్లు సాధించగా భాజీరావ్ హొడగే ఓ సూపర్ ట్యాకిల్ సహా ఐదు పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర వహించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించిన పట్నా ప్రథమార్ధాన్ని 15-10తో ముగించింది. ఓ దశలో నర్వాల్ విజయవంతమైన రైడ్స్‌తో పట్నా 22-12తో భారీ తేడా చూపించింది. ఇదే జోరు చివరి వరకు సాగగా పట్నా విజయం సులువైంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 28-27తో ఆఖరి నిమిషంలో యు ముంబాపై గెలిచింది. -
పట్టు వదిలేశారు
* ప్రొ కబడ్డీలో టైటాన్స్‌కు మూడో ఓటమి * పట్నా పైరైట్స్ హ్యాట్రిక్ విజయం సాక్షి, హైదరాబాద్: గతేడాది భాగ్యనగరంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-2లో తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ ఈసారి మాత్రం నాలుగో సీజన్లో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-35 స్కోరుతో పట్నా పైరేట్స్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ 39వ నిమిషంలో కూడా ఒక పాయింట్ ముందంజలో ఉన్న టైటాన్స్ వరుసగా మూడు పాయింట్లు ఇచ్చి చేజేతులా ఓడింది. ఈ సీజన్లో టైటాన్స్ ఆడిన మూడు మ్యాచ్‌లూ ఓడిపోగా... డిఫెండింగ్ చాంపియన్ పట్నా ఆడిన మూడూ గెలిచింది. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 11 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున ‘రైడర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రదీప్ నర్వాల్ కూడా 11 పాయింట్లు సాధించాడు. పోటాపోటీగా... మ్యాచ్ 14వ నిమిషం వరకు పైరేట్స్ ఆధిక్యంలో ఉంది. అయితే ఈ దశలో స్కోరును సమం చేసిన తెలుగు జట్టు ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లతో ముందంజ వేసింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 19-13 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో కూడా ఆకట్టుకున్న టైటాన్స్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఒక దశలో 8 పాయింట్లుతో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివరి రెండు నిమిషాల్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 26-18తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. ప్రొ కబడ్డీలో నేడు బెంగళూరు బుల్స్ X పుణెరి పల్టాన్ రాత్రి 8 గంటల నుంచి తెలుగు టైటాన్స్ X బెంగాల్ వారియర్స్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం -
కబడ్డీ... కబడ్డీ...
నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి కబడ్డీ సందడి మొదలైంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో లీగ్ మ్యాచ్‌లు నేటి నుంచి నాలుగు రోజుల పాటు గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను ఢీకొంటుంది. ఓవరాల్‌గా ఈ కబడ్డీ లీగ్‌లో టైటాన్స్ జట్టు 2015లో సెమీస్‌కు చేరి తమ ఉత్తమ ప్రదర్శనను చూపింది. ఈసారైనా తొలి టైటిల్ సాధించాలనే భావనలో ఉన్న టైటాన్స్.. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈనేపథ్యంలో సొంత ప్రేక్షకుల మద్దతుతో బోణీ కొట్టాలనే కసితో బరిలోకి దిగబోతోంది. రైడింగ్‌లో కెప్టెన్ రాహుల్ చౌధరి, ఆల్‌రౌండర్ సందీప్ నర్వాల్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది. పట్నా తమ ధాటిని కొనసాగిస్తూ ఆడిన రెండింట్లో నూ గెలిచి జోరు మీదుంది. దీంతో పూర్తి స్థాయిలో రాణిస్తే తప్ప టైటాన్స్‌కు విజయం దక్కదు. దబాంగ్ ఢిల్లీ బోణీ జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఎట్టకేలకు బోణీ చేసింది. శనివారం జరిగిన తమ నాలుగో మ్యాచ్‌లో 32-24తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ జట్టు 33-28తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది. ప్రస్తుతం పుణేరి జట్టు 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రొ కబడ్డీలో నేడు తెలుగు టైటాన్స్ x పట్నా పైరేట్స్ రాత్రి 8 గంటల నుంచి బెంగాల్ వారియర్స్ x యు ముంబా రాత్రి 9 గంటల నుంచి -
టాప్‌లో రాంచీ రేస్
♦ పంజాబ్ వారియర్స్‌పై విజయం ♦ హాకీ ఇండియా లీగ్ రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్‌కు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో మరో విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌ను 5-4 తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరంభంలో అర్మాన్ ఖురేషి (7వ నిమిషంలో) ఫీల్డ్ గోల్ చేయడంతో వారియర్స్ 2-0 ఆధిక్యం పొందింది. అయితే వెంటనే పుంజుకున్న రాంచీ... కొతజిత్ సింగ్ (18), డానియల్ బీల్ (28) ఫీల్డ్ గోల్ ్స చేయడంతో 4-2తో పైచేయి సాధించింది. కానీ 31వ నిమిషంలో సత్బీర్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో వారియర్స్ 4-4తో స్కోరును సమం చేయగలిగింది. ఈ దశలో ఇరువురు ఆటగాళ్లు పోటాపోటీగా తలపడినా 48వ నిమిషంలో సర్దార్ సింగ్ రాంచీ తరఫున పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయం అందించాడు.