పట్నా కూడా సెమీస్లోకి.. | Pro Kabaddi League, Jaipur Pink Panthers vs Patna Pirates: As it happened | Sakshi
Sakshi News home page

పట్నా కూడా సెమీస్లోకి..

Published Sun, Jul 24 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

పట్నా కూడా సెమీస్లోకి..

పట్నా కూడా సెమీస్లోకి..

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ కూడా సెమీఫైనల్లోకి చేరింది. శనివారం పుణెరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 31-28 తేడాతో నెగ్గడమే కాకుం డా 47 పాయింట్లతో జైపూర్‌ను వెనక్కినెట్టి టాప్‌కు చేరింది. పట్నా ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రదీప్ నర్వాల్ అద్భుత రైడింగ్‌తో 12 పాయింట్లు సాధించగా భాజీరావ్ హొడగే ఓ సూపర్ ట్యాకిల్ సహా ఐదు పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర వహించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపించిన పట్నా ప్రథమార్ధాన్ని 15-10తో ముగించింది. ఓ దశలో నర్వాల్ విజయవంతమైన రైడ్స్‌తో పట్నా 22-12తో భారీ తేడా చూపించింది. ఇదే జోరు చివరి వరకు సాగగా పట్నా విజయం సులువైంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 28-27తో ఆఖరి నిమిషంలో యు ముంబాపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement