టాప్లో రాంచీ రేస్ | ranchy race in top | Sakshi
Sakshi News home page

టాప్లో రాంచీ రేస్

Published Sun, Jan 31 2016 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

ranchy race in top

పంజాబ్ వారియర్స్‌పై విజయం
హాకీ ఇండియా లీగ్

 రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్‌కు హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్‌లో మరో విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌ను 5-4 తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఆరంభంలో  అర్మాన్ ఖురేషి (7వ నిమిషంలో) ఫీల్డ్ గోల్ చేయడంతో వారియర్స్ 2-0 ఆధిక్యం పొందింది. అయితే వెంటనే పుంజుకున్న రాంచీ... కొతజిత్ సింగ్ (18), డానియల్ బీల్ (28) ఫీల్డ్ గోల్ ్స చేయడంతో 4-2తో పైచేయి సాధించింది. కానీ 31వ నిమిషంలో సత్‌బీర్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో వారియర్స్ 4-4తో స్కోరును సమం చేయగలిగింది. ఈ దశలో ఇరువురు ఆటగాళ్లు పోటాపోటీగా తలపడినా 48వ నిమిషంలో సర్దార్ సింగ్ రాంచీ తరఫున పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement