Ranchi Race
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ముంబై, రాంచీ మ్యాచ్ డ్రా
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ తలపడుతుంది. -
సెమీస్ లో రాంచీ రేస్
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో రాంచీ 6-0తో ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్‌పై నెగ్గింది. దీంతో ఆరు విజయాలు, మూడు ఓటములతో మొత్తం 32 పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రాంచీ తరఫున ఒగ్లివి ఫ్లిన్ (40వ ని.), జాక్సన్ ఆష్లే (47వ ని.), సుమిత్ కుమార్ (59వ ని.) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించారు. తొలి రెండు క్వార్టర్స్‌లో ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లిన రాంచీ గోల్స్ కోసం చాలా అవకాశాలను సృష్టించుకుంది. రెండో అర్ధభాగంలో రాంచీ కొట్టిన ఐదు పెనాల్టీ కార్నర్లను గోల్‌కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. మూడో క్వార్టర్స్‌లో యూపీ అటాకింగ్ మొదలుపెట్టినా.. రాంచీ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. నాలుగో క్వార్టర్లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన రాంచీ మరో రెండు ఫీల్డ్ గోల్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్.. దబాంగ్ ముంబైతో తలపడుతుంది.a -
టాప్‌లో రాంచీ రేస్
♦ పంజాబ్ వారియర్స్‌పై విజయం ♦ హాకీ ఇండియా లీగ్ రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్‌కు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో మరో విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌ను 5-4 తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆరంభంలో అర్మాన్ ఖురేషి (7వ నిమిషంలో) ఫీల్డ్ గోల్ చేయడంతో వారియర్స్ 2-0 ఆధిక్యం పొందింది. అయితే వెంటనే పుంజుకున్న రాంచీ... కొతజిత్ సింగ్ (18), డానియల్ బీల్ (28) ఫీల్డ్ గోల్ ్స చేయడంతో 4-2తో పైచేయి సాధించింది. కానీ 31వ నిమిషంలో సత్బీర్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో వారియర్స్ 4-4తో స్కోరును సమం చేయగలిగింది. ఈ దశలో ఇరువురు ఆటగాళ్లు పోటాపోటీగా తలపడినా 48వ నిమిషంలో సర్దార్ సింగ్ రాంచీ తరఫున పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయం అందించాడు. -
ధోని జట్టుదే హాకీ టైటిల్
హెచ్ఐఎల్ ఫైనల్లో నెగ్గిన రాంచీ న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు దుమ్ము రేపుతుంటే... స్వదేశంలో హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లోనూ ధోని జట్టు అదరగొట్టింది. ధోని సహ యజమానిగా ఉన్న రాంచీ రేస్ జట్టు హెచ్ఐఎల్ మూడో సీజన్లో విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాంచీ జట్టు షూటవుట్స్లో 3-2తో పంజాబ్ వారియర్స్‌పై నెగ్గింది. మ్యాచ్ 39వ నిమిషంలో కీరన్ గోవర్స్ (పంజాబ్) గోల్ చేయగా... రాంచీ తరఫున స్టాన్లీ మింజ్ 42వ నిమిషంలో గోల్ సాధించాడు. క్రిస్టఫర్ సిరియెట్లో (56 వ ని.) గోల్‌తో పంజాబ్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి నిమిషంలో మిడిల్టన్ గోల్‌తో రాంచీ ఊపిరి పీల్చుకుంది. స్కోరు 2-2తో సమం కావడంతో... మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించారు. ఇందులో రాంచీ 3-2తో గెలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ 2-1తో యూపీ విజార్డ్స్‌ను ఓడించింది. -
ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రాంచీ రేస్, పంజాబ్ వారియర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తుది పోరు నేడు (ఆదివారం) జరుగనుంది. లీగ్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన రాంచీ రేస్... శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌పై పెనాల్టీ షూటవుట్స్ (9-8)లో నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. యూపీ తరఫున డ్రాగ్‌ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ (34వ ని.), రాంచీ నుంచి ఆష్లే జాక్సన్ (41వ ని.) గోల్స్ చేశారు. ఆ తర్వాత పెనాల్టీ షూటవుట్స్లోనూ ఫలితం తేలక 3-3తో స్కోరు సమమైంది. చివరకు సడెన్ డెత్‌లో రాంచీ రేస్ గట్టెక్కింది. ఇక మరో సెమీస్‌లో పంజాబ్ వారియర్స్ 2-0తో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. సందీప్ సింగ్ (3వ ని.), ఆగస్టిన్ మజిలీ (35వ ని.) గోల్ చేశారు. మరోవైపు మూడో స్థానం కోసం ఢిల్లీ, విజార్డ్స్ తలపడనున్నాయి. -
జాక్సన్ ‘హ్యాట్రిక్’
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రాంచీ రేస్ కెప్టెన్ ఆష్లే జాక్సన్ ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగాడు. మూడు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాంచీ 4-0తో కళింగ లాన్సర్పై విజయం సాధించింది. 11వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన జాక్సన్... 32వ నిమిషంలో దాన్ని డబుల్ చేశాడు. మరో రెండు నిమిషాల తర్వాత విల్సన్ (34వ ని.) ఫీల్డ్ గోల్ చేయగా... 41వ నిమిషంలో జాక్సన్ హ్యాట్రిక్ గోల్ చేశాడు. -
రాంచీ రేస్ విజయం
లక్నో: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఈ జట్టుపై 2-0తో రాంచీ రేస్ విజయం సాధించింది. ప్రారంభం నుంచే రెండు జట్లు దూకుడును కనబరిచాయి. రెండో నిమిషంలోనే రాంచీ పెనాల్టీ కార్నర్ అవకాశం పొందినా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 11వ నిమిషంలో విజార్డ్స్‌కు వచ్చిన పెనాల్టీ కార్నర్ విఫల మైంది. అయితే 13వ నిమిషంలో ప్రత్యర్థి లోపాలను ఆసరాగా చేసుకుని స్ట్రయికర్ ట్రెంట్ మిట్టన్ తొలి గోల్ చేసి రాంచీకి ఆధిక్యాన్ని అందించాడు. విజార్డ్స్ డిఫెన్స్‌ను ఏమార్చుతూ 42వ నిమిషంలో మన్దీప్ సింగ్ చేసిన గోల్‌తో రాంచీకి రెండో గోల్ దక్కింది.