Fox Star Studios
-
30న తెరపైకి అసాస్సిన్స్ క్రీడ్
యాక్షన్, త్రిల్లర్తో కూడిన హాలీవుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారిని అలరించడానికి ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ అసాస్సిన్స్ క్రీడ్ పేరుతో మరో బ్రహ్మాండ పోరాటాలతో కూడిన యాక్షన్ చిత్రాన్ని అందిస్తోంది. అకాడమీ అవార్డు గ్రహీత మారిన్ కాటీలార్డ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జస్టిన్ కెర్జెన్ దర్శకత్వం వహించారు. 2007లో ఒక వీడియోగా ప్రచారం అయిన ఒక గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. ఆ ఇతివృత్తంతో తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రమే ఈ అసాస్సిన్స్ క్రీడ్ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఉరిశిక్ష పడిన హంతకుడిని గత జన్మకు చెందిన రక్త సంబంధికుడి సంఘటనలు నీడలా వెంటాడుతుంటాయన్నారు. అలాంటి వ్యక్తిని అబ్స్టర్గో అనే సంస్థకు చెందిన వారు రక్షించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 15వ శతాబ్దానికి పంపుతారని తెలిపారు. ఆ వ్యక్తికి ఆ సంస్థకు సంబంధం ఏమిటీ? అతని ద్వారా ఆ సంస్థ ఎవరితో పోడారాలకుంటుంది? ఇటువంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం అసాస్సిన్స్ క్రీడ్ అని చిత్ర వర్గాలు తెలిపాయి. 200 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. -
ఇండిపెండెన్స్‌డే సీక్వెల్‌కు సిద్ధం
ఇండిపెండెన్స్‌డే రెండు దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చిన హాలీవుడ్ చిత్రం ఇది. అయినా ఆంగ్ల చిత్రాల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో కూడా గుర్తుండి పోయిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. 1996లో 75 మిలియన్ల అమెరికన్ డాలర్స్ వ్యయంతో రూపొంది 817 మిలియన్ల అమెరికన్ డాలర్లు వసూలు చేసి అప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచిన దర్శకుడు రోలండ్ ఎమిరిచ్ అద్భుత సృష్టి ఇండిపెండెన్స్‌డే చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రం అమెరికా స్వాతంత్య్రదినోత్సవం రోజైన ఏప్రిల్ నాలుగో తేదీన విడుదలవడం అన్నది యాదృచ్చికంగా జరిగిందే. అప్పట్లో గ్రామీ అవార్డును అందుకున్న ఈ చిత్రానికి రెండు దశాబ్దాల తరువాత ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ పేరుతో సీక్వెల్ నిర్మాణం జరిగింది. అప్పట్లో 75 మిలియన్స్ అమెరికా డాలర్లు వ్యయంతో రూపొందిన ఇండిపెండెన్స్‌డే చిత్రానికి పార్టు-2ను ఇప్పుడు 200 మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయంతో ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్రంలో నటించిన బిల్పుల్మాన్, జెఫ్ గోల్డ్బమ్ సీక్వెల్లోనూ నటించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్ర కథను కూడా ఎవరూ మరచిపోలేరు. ఇతర గ్రహాల నుంచి ఎలియన్స్ మానవ జాతిపై దాడి చేయడం, వాటి నుంచి మానవులు ఎలా రక్షింపబడతారన్న పలు ఆసక్తికరమైన అంశాలను గ్రాఫిక్స్‌ను జోడించి బ్రహ్మాండంగా తెరకెక్కించిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. అయితే దానికి సీక్వెల్ అయిన ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్వాహకులు వెల్లడించారు. -
5న కాక్కముట్టై
పరిశ్రమ వర్గాల అంచనాలను మించి జాతీయ అవార్డును గెలుచుకున్న చిత్రం కాక్కముట్టై. నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. నవ దర్శకుడు మణి కంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విఘ్నేష్, రమేష్ అనే బాలతారలు ప్రధాన పాత్రలు పోషించారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది. చిత్రాన్ని జూన్ ఐదున తమిళంతో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి ఫాక్స్ స్టార్ స్టూడియో సన్నాహాలు చేస్తోంది. జపాన్, సౌత్‌కొరియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కాక్కముట్టై విడదల కానుంది. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ఒక చిన్న చిత్రం ఇలా అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్లడం అరుదైన విషయమే అవుతోంది. -
కాస్ట్యూమ్స్‌కి కోటి రూపాయలా?!
ఒక చిన్న సినిమాకయ్యే ఖర్చుని.. కేవలం కథానాయిక కాస్ట్యూమ్స్ కోసం ఖర్చుపెట్టారంటే కచ్చితంగా అది వార్తే అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రానికి సంబంధించి ఇలాంటి వార్తే హల్చల్ చేస్తోంది. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కత్రినా ఆధునిక యువతి పాత్ర పోషిస్తున్నారు. అందుకని, ఆమె కోసం చాలా ఖరీదు గల దుస్తులను డిజైన్ చేయించారట. ముందు అనుకున్నదానికన్నా కాస్ట్యూమ్స్ ఖర్చు పెరగడం నిర్మాతలను అసహనానికి గురి చేసిందని సమాచారం. ఇప్పటికి కోటి రూపాయలు ఖర్చుపెట్టినా, ఇంకా కత్రినాకు రెండు గౌన్లు డిజైన్ చేయించాల్సి వచ్చిందట. ఆ రెండు గౌన్లకు నాలుగు లక్షల రూపాయలవుతుందని డిజైనర్ చెప్పడంతో, ‘ఇక కాస్ట్యూమ్స్ కోసం మేం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేం’ అని చేతులెత్తేశారట. విషయం తెలుసుకున్న కత్రినా సదరు డిజైనర్‌ని పిలిచి, నాలుగు లక్షల రూపాయలిచ్చారని బాలీవుడ్ టాక్. ఒక్క కత్రినా కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రమే కాకుండా.. ఇతర విషయాలపరంగా కూడా ఈ చిత్రం బడ్జెట్ పరిధులు దాటిందని భోగట్టా. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం హద్దులు దాటడం సహజమే అయినా... అనుకున్నదానికన్నా అదనంగా ఖర్చుపెట్టినా ఇంకా సినిమా పూర్తి కాకపోవడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారట