30న తెరపైకి అసాస్సిన్స్‌ క్రీడ్‌ | asassins Creed on screen on 30th | Sakshi
Sakshi News home page

30న తెరపైకి అసాస్సిన్స్‌ క్రీడ్‌

Published Tue, Dec 20 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

30న తెరపైకి అసాస్సిన్స్‌ క్రీడ్‌

30న తెరపైకి అసాస్సిన్స్‌ క్రీడ్‌

యాక్షన్, త్రిల్లర్‌తో కూడిన హాలీవుడ్‌ కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి  ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారిని అలరించడానికి ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ అసాస్సిన్స్ క్రీడ్‌ పేరుతో మరో బ్రహ్మాండ పోరాటాలతో కూడిన యాక్షన్ చిత్రాన్ని అందిస్తోంది. అకాడమీ అవార్డు గ్రహీత మారిన్ కాటీలార్డ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి జస్టిన్ కెర్జెన్ దర్శకత్వం వహించారు. 2007లో ఒక వీడియోగా ప్రచారం అయిన ఒక గేమ్‌ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. ఆ ఇతివృత్తంతో తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమే ఈ అసాస్సిన్స్ క్రీడ్‌ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఉరిశిక్ష పడిన హంతకుడిని గత జన్మకు చెందిన రక్త సంబంధికుడి సంఘటనలు నీడలా వెంటాడుతుంటాయన్నారు.

అలాంటి వ్యక్తిని అబ్‌స్టర్‌గో అనే సంస్థకు చెందిన వారు రక్షించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 15వ శతాబ్దానికి పంపుతారని తెలిపారు. ఆ వ్యక్తికి ఆ సంస్థకు సంబంధం ఏమిటీ? అతని ద్వారా ఆ సంస్థ ఎవరితో పోడారాలకుంటుంది? ఇటువంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం అసాస్సిన్స్ క్రీడ్‌ అని చిత్ర వర్గాలు తెలిపాయి. 200  మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement