కాస్ట్యూమ్స్‌కి కోటి రూపాయలా?! | 1 crore to Costumes?! | Sakshi
Sakshi News home page

కాస్ట్యూమ్స్‌కి కోటి రూపాయలా?!

Published Sat, Jul 5 2014 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కాస్ట్యూమ్స్‌కి  కోటి రూపాయలా?! - Sakshi

కాస్ట్యూమ్స్‌కి కోటి రూపాయలా?!

ఒక చిన్న సినిమాకయ్యే ఖర్చుని.. కేవలం కథానాయిక కాస్ట్యూమ్స్ కోసం ఖర్చుపెట్టారంటే కచ్చితంగా అది వార్తే అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రానికి సంబంధించి ఇలాంటి వార్తే హల్‌చల్ చేస్తోంది. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కత్రినా ఆధునిక యువతి పాత్ర పోషిస్తున్నారు.

అందుకని, ఆమె కోసం చాలా ఖరీదు గల దుస్తులను డిజైన్ చేయించారట. ముందు అనుకున్నదానికన్నా కాస్ట్యూమ్స్ ఖర్చు పెరగడం నిర్మాతలను అసహనానికి గురి చేసిందని సమాచారం. ఇప్పటికి కోటి రూపాయలు ఖర్చుపెట్టినా, ఇంకా కత్రినాకు రెండు గౌన్లు డిజైన్ చేయించాల్సి వచ్చిందట. ఆ రెండు గౌన్లకు నాలుగు లక్షల రూపాయలవుతుందని డిజైనర్ చెప్పడంతో, ‘ఇక కాస్ట్యూమ్స్ కోసం మేం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేం’ అని చేతులెత్తేశారట.

విషయం తెలుసుకున్న కత్రినా సదరు డిజైనర్‌ని పిలిచి, నాలుగు లక్షల రూపాయలిచ్చారని బాలీవుడ్ టాక్. ఒక్క కత్రినా కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రమే కాకుండా.. ఇతర విషయాలపరంగా కూడా ఈ చిత్రం బడ్జెట్ పరిధులు దాటిందని భోగట్టా. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం హద్దులు దాటడం సహజమే అయినా... అనుకున్నదానికన్నా అదనంగా ఖర్చుపెట్టినా ఇంకా సినిమా పూర్తి కాకపోవడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement