5న కాక్కముట్టై | kakka muttai movie june 5th release | Sakshi
Sakshi News home page

5న కాక్కముట్టై

Published Sat, May 30 2015 2:45 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

5న కాక్కముట్టై - Sakshi

5న కాక్కముట్టై

పరిశ్రమ వర్గాల అంచనాలను మించి జాతీయ అవార్డును గెలుచుకున్న చిత్రం కాక్కముట్టై. నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. నవ దర్శకుడు మణి కంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విఘ్నేష్, రమేష్ అనే బాలతారలు ప్రధాన పాత్రలు పోషించారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం ఆసన్నమైంది.


చిత్రాన్ని జూన్ ఐదున తమిళంతో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి ఫాక్స్ స్టార్ స్టూడియో సన్నాహాలు చేస్తోంది. జపాన్, సౌత్‌కొరియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కాక్కముట్టై విడదల కానుంది. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ఒక చిన్న చిత్రం ఇలా అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్లడం అరుదైన విషయమే అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement