free offers
-
ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు....
దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. #AirtelThanks ను ఎయిర్టెల్ ప్రకటించింది. దీని కింద లోయల్ కస్టమర్లకు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. నెలకు రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ఆర్పూ నమోదయ్యే ఎయిర్టెల్ కస్టమర్లకు, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా.. అదనపు ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ప్రయోజనాల్లో ప్రీమియం డిజిటల్ కంటెంట్, ఆన్లైన్ షాపింగ్ ఓచర్లు ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ సబ్స్క్రైబర్లకు అదనంగా రూ.1500 విలువైన మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను లభించనుంది. #AirtelThanks ప్రొగ్రామ్‌ను వీ-ఫైబర్ హోమ్ బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు కూడా ఎయిర్టెల్ విస్తరించబోతుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌తో కూడా ఎయిర్టెల్ భాగస్వామ్యం పెట్టుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అన్ని ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్ఫోన్లపై 100జీబీ బోనస్ డేటాతో పాటు రూ.4500 వరకు విలువైన ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. దీనిలో రూ.2500ను క్యాష్‌బ్యాక్ రూపంలో ఇస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ ఓచర్ల రూపంలో ఆఫర్ చేస్తోంది. అంతేకాక ఎయిర్టెల్ తన ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రూ.499, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.1500 విలువైన మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ గిఫ్ట్ ఓచర్‌ను కూడా ఎలాంటి అదనపు ఛార్జ్ లేకుండా అందిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్ గిఫ్ట్ ఎయిర్టెల్ టీవీ యాప్, మై ఎయిర్టెల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు జీ5 కంటెంట్ కూడా ఉచితంగా లభించనుంది. -
టెలికం సర్వీసులకు ఫ్లోర్ ప్రైస్!
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమలో ఉచిత ఆఫర్లు ఎక్కువౌతోన్న నేపథ్యంలో టెల్కోలు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. ఇవి వాయిస్, డేటా సేవలపై ఫ్లోర్ ప్రైస్‌ను అమలుచేయాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్‌ను కోరాయి. ఫ్లోర్ ప్రైస్ విధానంలో ఒక ఆపరేటర్ నిర్దేశించిన ధరకు తక్కువగా వాయిస్, డేటా సర్వీసులను కస్టమర్లకు ఆఫర్ చేయకూడదు. ఏడు ప్రధాన టెలికం కంపెనీలకు చెందిన ప్రతినిధులు గురువారం ట్రాయ్ చైర్మన్‌తో సమావేశమయ్యారు. టెల్కోలు ఫ్లోర్ ప్రైస్ అంశం గురించి తమతో చర్చించాయని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ‘ఫ్లోర్ ప్రైస్ అనేది టెక్నాలజీ, నెట్వర్క్ వినియోగం, పరిమాణం వంటి చాలా అంశాలపై ఆధారపడుతుంది.ఇది క్లిష్టమైనది. దీనిపై చాలా స్పష్టత రావాల్సి ఉంది’ అని వివరించారు. అయితే దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. -
జియో ఉచిత ఆఫర్లు కొనసాగుతాయ్!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో అందించే ఉచిత ఆఫర్లపై స్టే విధించడానికి టెలికాం ట్రిబ్యునల్ నిరాకరించింది. జియో ఉచిత సేవల నిలిపివేతకు నిరాకరించిన టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెట్ ట్రిబ్యునల్(టీడీశాట్), అయితే ఆ ఆఫర్లను కొనసాగించుకునేలా ఆపరేటర్ కు ఇచ్చిన జనవరి 31 నాటి అనుమతిని పునఃపరిశీలించాలని ట్రాయ్ ను ఆదేశించింది. రెండు వారాల్లో దీనిపై ఓ నివేదికను తమకు అందించాలని ట్రాయ్ కి టీడీశాట్ ఆదేశాలు జారీచేసింది. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లపై స్టే విధించాలని కోరుతూ టెలికాం కంపెనీలు వేసిన మధ్యంతర అప్పీల్ పై ఆదేశాలను టీడీశాట్ రిజర్వులో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లు కొనసాగేలా, ఆఫర్లపై స్టే విధించడానికి టీడీశాట్ నిరాకరించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్ ను కస్టమర్లకు అందిస్తోంది. డిసెంబర్ లో మళ్లీ తమ ఉచిత సర్వీసులను 2017 మార్చి 31 వరకు పొడిగించింది. దీనిపై ఆగ్రహించిన టెలికాం కంపెనీలు ట్రాయ్ కు వ్యతిరేకంగా టీడీశాట్ ను ఆశ్రయించాయి. జియో ఉచిత కాలింగ్, డేటా ప్లాన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన కంపెనీ చేయడం లేదని రెగ్యులేటరీ ట్రాయ్ క్లీన్ చీట్ ఇచ్చింది. జియో వెల్ కమ్ ఆఫర్ కు, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కు తేడా ఉందని ట్రాయ్ పేర్కొంది.