ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.... | Airtel Reveals Freebies For Subscribers | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు....

Published Sat, Oct 13 2018 6:59 PM | Last Updated on Sat, Oct 13 2018 6:59 PM

Airtel Reveals Freebies For Subscribers - Sakshi

దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది.  #AirtelThanks ను ఎయిర్‌టెల్‌​ ప్రకటించింది. దీని కింద లోయల్‌ కస్టమర్లకు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. నెలకు రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ఆర్పూ నమోదయ్యే ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా.. అదనపు ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ ప్రయోజనాల్లో ప్రీమియం డిజిటల్‌ కంటెంట్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఓచర్లు ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్‌టెల్‌ ఇన్‌ఫినిటీ పోస్ట్‌పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు అదనంగా రూ.1500 విలువైన మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను లభించనుంది. #AirtelThanks ప్రొగ్రామ్‌ను వీ-ఫైబర్‌ హోమ్‌ బ్రాండ్‌బ్యాండ్‌ కస్టమర్లకు కూడా ఎయిర్‌టెల్‌ విస్తరించబోతుంది. 

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌తో కూడా ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యం పెట్టుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో అన్ని ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్మార్ట్‌ఫోన్లపై 100జీబీ బోనస్‌ డేటాతో పాటు రూ.4500 వరకు విలువైన ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. దీనిలో రూ.2500ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఇస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్‌ ఓచర్ల రూపంలో ఆఫర్‌ చేస్తోంది. అంతేకాక ఎయిర్‌టెల్‌ తన ఇన్‌ఫినిటీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.499, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.1500 విలువైన మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ గిఫ్ట్‌ ఓచర్‌ను కూడా ఎలాంటి అదనపు ఛార్జ్‌ లేకుండా అందిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ గిఫ్ట్‌ ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌, మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ కస్టమర్లకు జీ5 కంటెంట్‌ కూడా ఉచితంగా లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement