friendly fight
-
‘మా మధ్య ఫ్రెండ్లీ పోటీనే’.. డిగ్గీ రాజాతో పోరుపై థరూర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్‌లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పోటీపై ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు శశి థరూర్. ‘ఇది ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ కాదు.. సహచరుల మధ్య జరిగే స్నేహపూర్వక పోటీ’ అని పేర్కొన్నారు. శశిథరూర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. శశి థరూర్ వ్యాఖ్యాలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీ మతత్వత శక్తులకు వ్యతిరేకంగా జరుగుతోందని, తాము ఇరువురు గాంధీయన్, నెహ్రూవియన్ భావజాలాలను నమ్ముతామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై శశిథరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. ఇరువురు నేతలు తమ నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అధ్యక్ష పోటీలో నిలిచేందుకు నామినేషన్ పత్రాలను శశిథరూర్.. వారం రోజుల క్రితమే తీసుకోగా.. దిగ్విజయ్ సింగ్ గురువారం తీసుకున్నారు. Received a visit from @digvijaya_28 this afternoon. I welcome his candidacy for the Presidency of our Party. We both agreed that ours is not a battle between rivals but a friendly contest among colleagues. All we both want is that whoever prevails, @incIndia will win!✋🇮🇳 pic.twitter.com/Df6QdzZoRH — Shashi Tharoor (@ShashiTharoor) September 29, 2022 I agree @ShashiTharoor we are fighting the Communal Forces in India. Both believe in the Gandhian Nehruvian Ideology and shall fight them relentlessly come what may. Best wishes. @INCIndia @RahulGandhi @priyankagandhi @Jairam_Ramesh https://t.co/5KHn6P8Yug — digvijaya singh (@digvijaya_28) September 29, 2022 ఇదీ చదవండి: Congress President Elections: పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్ -
ఈ ఫ్రెండ్లీ ఫైట్.. ఎవరికో రైట్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కూటమి పేరుతో జతకట్టిన తెలుగుదేశం- బీజేపీలు నామినేషన్ల ఉపసంహరణ రోజు ఆడిన నాటకం టీఆర్ఎస్కు కొన్ని సీట్లను పెంచబోతోందని ఆ రెండు పార్టీల నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 150 సీట్లకు గాను టీడీపీ 87, బీజేపీ 63 సీట్లలో పోటీ చేయాలని తొలుత ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే బీజేపీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు, టీడీపీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ రోజు ఏదోలా సర్దుకుంటుందిలే అనుకున్న అధికారిక అభ్యర్థుల గుండెల్లో చివరి నిమిషంలో బాంబులు పడ్డాయి. టీడీపీ తన సీట్లు 87కు అదనంగా 5చోట్ల అధికారికంగా, మరో రెండు చోట్ల అనధికారికంగా బీ-ఫారాలు ఇచ్చింది. అది తెలిసిన వెంటనే బీజేపీ అభ్యర్థులు తమ అగ్రనేతలను కలవడంతో వారు కూడా టీడీపీకి ఇచ్చిన ఐదు స్థానాలో తమ వాళ్లకు బీ-ఫారాలు ఇచ్చి ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’కు తెరలేపారు. చర్లపల్లి, మల్లాపూర్, జూబ్లిహిల్స్ వంటి చోట్ల టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు రావడంతో బీజేపీ నాయకులు ఆందోళన చెందుతుంటే, అడిక్‌మెట్, అమీర్‌పేట, హబ్సిగూడ వంటి బీజేపీ గెలిచే అవకాశాలున్న చోట టీడీపీ అభ్యర్థులు బీ-ఫారాలు ఇచ్చి అభ్యర్థులను నిలబెట్టడంతో రెండు పార్టీల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు పార్టీల జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు టీఆర్ఎస్తో కుమ్మక్కై చివరి నిమిషంలో అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఫ్రెండ్లీ ఫైట్’ పేరుతో పోటీలో ఉన్న సుమారు 12 స్థానాల్లోని మెజారిటీ స్థానాలు ఇప్పుడు టీఆర్ఎస్కు కేక్‌వాక్‌గా తయారయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ను గెలిపించేందుకు... కేటీఆర్ వంద స్థానాలు గెలుచుకుంటామని చెప్పిన మాటలు నిజం చేసేందుకు టీడీపీ, బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.