FRL
-
ఫ్యూచర్ రిటైల్: అంబానీ, అదానీకి పోటీగా కంపెనీలు నువ్వా? నేనా?
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు రేసులో మొత్తం 13 కంపెనీలు నిల్చాయి. దీనికి సంబంధించి రూపొందించిన తుది జాబితాలో ముఖేశ్ అంబానీ రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్‌తో పాటు మరో 11 కంపెనీలు ఉన్నాయి. నవంబర్ 10న విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టుపై రుణ దాతల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆయా కంపెనీలను తుది జాబితాలోనూ చేర్చినట్లు ఎఫ్ఆర్ఎల్ పరిష్కార నిపుణుడు (ఆర్పీ) వెల్లడించారు. (బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు) ఎఫ్ఆర్ఎల్ రుణ భారం రూ. 24,713 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సినది రూ. 21,433 కోట్లు కాగా, ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ. 2,464 కోట్ల మేర కట్టాలి. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా పిటీషన్ వేసింది. ఎఫ్ఆర్ఎల్ సహా 19 ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల టేకోవర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నించినా.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యపడలేదు. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) -
రూ. 7,000 కోట్ల పెట్టుబడికి ‘సమర’ సిద్ధం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్ సిద్ధంగా ఉందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఎఫ్ఆర్ఎల్ నుంచి బిగ్ బజార్ తదితర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా సుమారు రూ. 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సుముఖంగానే ఉందని తెలిపింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు జనవరి 22న రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించింది. రుణదాతలకు జరపాల్సిన చెల్లింపుల కోసం జనవరి 29 డెడ్‌లైన్ లోగా రూ. 3,500 కోట్లు సమకూర్చగలరా లేదా అన్నది తెలియజేయాలంటూ ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు గతంలో రాసిన లేఖపై అమెజాన్ ఈ మేరకు స్పందించింది. 2020 జూన్ 30 నాటి టర్మ్ షీట్ ప్రకారం రూ. 7,000 కోట్లకు ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను (బిగ్ బజార్, ఈజీడే, హెరిటేజ్ మొదలైనవి) కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని సమర క్యాపిటల్ తమకు తెలిపిందని అమెజాన్ పేర్కొంది. ఇందుకోసం ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను మదింపు చేసేందుకు అవసరమైన వివరాలను సమరకు అందించాలని తెలిపింది. అయితే, సమర క్యాపిటల్ ఆ విషయాన్ని నేరుగా ఎఫ్ఆర్ఎల్కు తెలపకుండా అమెజాన్‌తో ఎందుకు చర్చిస్తోందన్న అం శంపై వివరణ ఇవ్వలేదు. సుమారు రూ. 24,713 కోట్లకు బిగ్ బజార్ తదితర వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ చేస్తున్న యత్నాలను ఎఫ్‌ఆర్‌ఎల్‌లో పరోక్ష వాటాదారైన అమెజాన్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం సాగిస్తోంది. -
గరిష్టస్థాయికి కిన్నెరసాని నీటిమట్టం
కిన్నెరసాని (పాల్వంచ రూరల్): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువనుంచి వరద వస్తున్న కారణంగా కిన్నెరసాని నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల కిన్నెరసాని రిజర్వాయర్‌లో గురువారం నాటికి 406.70 అడుగుల వరకు ఉంది. ఎగువ నుంచి 3 అడుగుల వరకు వరద రావడంతో శుక్రవారం సాయంత్రం నాటికి 407 అడుగులకు పెరిగిందని డ్యామ్‌సైడ్ ఇంజనీర్ తెలిపారు. ఇంకా ఇ¯ŒSఫ్లో పెరిగితే ఒక గేటును ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు చెప్పారు.