funarals
-
విమానంలో క్వీన్ మృతదేహాన్ని మోసుకెళ్లి....
లండన్: బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని రాణి అధికారిక నివాసం రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. తదనంతరం విమానంలో లండన్‌కి తరలిస్తారు. ఇది ఆమె చివరి ఫ్లైట్ జర్నీగా చెప్పవచ్చు. ఈ మేరకు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్24 ద్వారా బోయింగ్ సీ17 విమానంలో ఆమె భౌతిక దేహాన్ని తీసుకువెళ్తున్న చివరి ప్రయాణాన్ని అత్యధిక మంది ఆన్లైన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేకాదు ఎడిన్బర్గ్ విమానాశ్రయంలో బోయింగ్ సీ17ఏ ఎగరడానికి సిద్ధంగా ఉన్న మొదటి నిమిషంలోనే సుమారు 6 మిలియన్ల మంది విమానాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. బోక్ అర్గోనాట్ అటలాంటాలో క్వీన్‌గా ఆమె తొలి ఫైట్ ప్రయాణానికి 70 సంవత్సరాల తర్వాత క్వీన్ ఎలిజబెత్ 2 చివరి విమానమే చరిత్రలో అత్యధికాంగా ట్రాక్ చేయబడిన విమానం. అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ వివాదాస్పద పర్యటనను ఫ్లైట్ రాడార్24 వెబ్సైట్లో ట్రాక్ చేసిన దానికంటే రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల ఎక్కువ అని పేర్కొంది. 📊 Flight tracking statistics regarding the final flight of Queen Elizabeth II In the minute after the transponder of C-17 ZZ177 activated, an unprecedented 6 million people attempted to follow the flight. This unfortunately impacted the stability of our platform. pic.twitter.com/VBB7vOhk3A — Flightradar24 (@flightradar24) September 13, 2022 (చదవండి: ఎలిజబెత్ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్) -
కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ నెల్లూరు సెంట్రల్: ఆత్మీయులు, అశేష జన సందోహం వెంట రాగా.. జోహారన్నా.. మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్‌రహే అనే నినాదాల నడుమ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. సీఎం వైఎస్ జగన్ దంపతులు, బంధుమిత్రులు, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు కడసారి గౌతమ్‌రెడ్డి పార్ధివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి 11.59 గంటలకు చితికి నిప్పు అంటించగా పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి తుపాకులు పేల్చారు. స్వగ్రామం మీదుగా ఉదయగిరికి నెల్లూరు డైకస్ రోడ్డులోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, పి.అనిల్‌కుమార్ యాదవ్, ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య కాన్వాయ్ వెంట రాగా జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, నెల్లూరు పాళెం, డీసీపల్లె, మర్రిపాడు, బ్రాహ్మణపల్లె, నందిపాడు మీదుగా అంతిమయాత్ర 10.45 గంటలకు ఉదయగిరికి చేరుకుంది. కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పార్థివదేహాన్ని ఉంచారు. 11.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులు అక్కడకు చేరుకోగా అప్పటికే అంతిమ సంస్కారానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని సిద్ధం చేశారు. శాస్త్రోక్తంగా కుమారుడు ముందు నడుస్తుండగా పాడెను బంధుమిత్రులు చితి వరకూ మోసుకొచ్చారు. బరువెక్కిన హృదయాలతో.. బరువెక్కిన హృదయాలు, అశ్రు నయనాలతో మేకపాటి కుటుంబీకులు గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి వేదన వర్ణనాతీతం. సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె సాయి అనన్య, కుమారుడు కృష్ణార్జునరెడ్డి, సోదరులు విక్రమ్‌రెడ్డి, పృధ్వీరెడ్డి, సమీప బంధువులు చివర చూపు అనంతరం చితిపై గంధపు చెక్కలను పేర్చారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చితిపై గంధపు చెక్కలు పేర్చి నెయ్యి వేశారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన అనంతరం చితికి కృష్ణార్జునరెడ్డి నిప్పు అంటించారు. మా ధైర్యం వెళ్లిపోయింది.. తమ ఆత్మీయ నేతను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రహదారులపైకి తరలి వచ్చారు. కాన్వాయ్‌పై ఊరూరా పూలవర్షం కురిపించారు. మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంబులెన్స్‌ను పట్టుకుని వెక్కి వెక్కి విలపించారు. ఆప్యాయంగా పలకరించే మా ధైర్యం వెళ్లిపోయిందంటూ రోదించారు. తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరై నివాళులర్పించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకరనారాయణ, పినిపె విశ్వరూప్, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గల్లా జయదేవ్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, డీసీ గోవింద రెడ్డి, పోతుల సునీత, వాకాటి నారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కె.శ్రీనివాసులు, శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కరణం బలరాం, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, అన్నా రాంబాబు, డా.సుధ, మేడా మల్లికార్జున రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హఫీజ్ ఖాన్, కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ శిద్దారెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి, బిజేంద్రనాథరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే.. ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలుపొందినా నెల్లూరుతో మేకపాటి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. డైకస్ రోడ్డులోని నివాసాన్ని మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎంతో ఇష్టపడి కట్టించుకున్నారు. అలాంటి ఇంటి నుంచి చివరిసారి వెళ్లిపోతున్నావా.. అంటూ అంతిమ యాత్ర ప్రారంభం కాగానే అంతా కన్నీటి పర్యంతమయ్యారు. నాన్నకు నచ్చిన దుస్తుల్లో.. గౌతమ్‌రెడ్డి ఎక్కువగా లాల్చి, పైజామా ధరిస్తుంటారు. జిల్లాలో ఎక్కడకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఎక్కువగా వీటినే ధరిస్తారు. తమ తండ్రికి ఎంతో ఇష్టమైన లాల్చి, పైజామాను కుమారుడు కృష్ణార్జునరెడ్డి, కుమార్తె అనన్య చివరిసారిగా తొడిగి నివాళులు అర్పించారు. ఎటైనా ‘డిఫెండర్’లోనే.. మంత్రి గౌతమ్‌రెడ్డికి లగ్జరీ కార్లు అంటే ఆసక్తి. ఇటీవలే ఆయన డిఫెండర్ కారును కొనుగోలు చేశారు. ఏ కార్యక్రమానికైనా అందులోనే వెళ్లేవారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆ కారును బాగా ఇష్టపడేవారని పలువురు అభిమానులు తెలిపారు. -
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
హైదరాబాద్: అశ్రునయనాల మధ్య సినీనటి, దర్శకురాలు విజయనిర్మల అంతిమయాత్ర నానక్‌రాంగూడలోని ఆమె నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. భర్త కృష్ణ, కుమారుడు నరేశ్, హీరో మహేష్‌బాబు.. విజయనిర్మల పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన ట్రక్‌పైకి తరలించారు. అనంతరం విజయనిర్మల అమర్‌రహే అన్న అభిమానుల నినాదాల నడుమ ఇంటి నుంచి ప్రత్యేక వాహనం ముందు సాగింది. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు, జూనియర్ ఆర్టిస్టులు విజయనిర్మలను కడసారిగా చూసి నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడలోని పోచమ్మ అమ్మవారంటే కృష్ణ, విజయనిర్మల దంపతులకు అత్యంత భక్తి. ఆ ఆలయం వద్దకు రాగానే అంతియ యాత్రను కొద్దిసేపు నిలిపారు. ప్రతియేటా బోనాల సమయంలో విజయనిర్మల తనవంతు సహకారం అందించేవారు. దీంతో గ్రామస్తుల తరఫున స్థానికులు ఆమె పార్థివదేహంపై శాలువా కప్పి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిలుకూరు వరకు యాత్ర సాగింది. నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నానక్‌రాంగూడలోని కృష్ణ, విజయనిర్మల నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.34 గంటలకు చేరుకున్నారు. ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించి కృష్ణ, నరేశ్‌ను ఓదార్చారు. ఏపీ సీఎం వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. సినీనటుడు కృష్ణను ఓదారుస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చిలుకూరులో అంత్యక్రియలు మొయినాబాద్ (చేవెళ్ల): విజయనిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు నానక్‌రాంగూడ నుంచి మొదలైన అంతిమ యాత్ర మధ్యాహ్నం 12.50 గంటలకు చిలుకూరు వ్యవసాయక్షేత్రానికి చేరుకుంది. ఆమె కుమారుడు నరేశ్ ముందు నడిచి కర్మకాండలు నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం నరేశ్ చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు కొన్ని నిమిషాల ముందే కృష్ణ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పార్థివదేహాన్ని చితిపై పెట్టే ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 1.40 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిలుకూరు ఫాంహౌస్‌లో జరిగిన అంత్యక్రియలకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సినీ ప్రముఖులు కల్యాణ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఆర్మీ జవాను అంత్యక్రియలు
కె.కోటపాడు: ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఆర్మీ జవాను కిల్లాడ ఎర్రినాయుడు(36) అంత్యక్రియలు శనివారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం లంకవాని పాలెంలో సైనిక లాంచనాలతో పూర్తయ్యాయి. అలహాబాద్‌లో ఆర్మీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రినాయుడు ఏడాదికోసారి జరిగే సైనిక శిక్షణ, విన్యాసాల కోసం రైలులో వెళుతూ ఈ నెల 17న విద్యుదాఘాతానికి గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. మృతదేహాన్ని లంకవానిపాలేనికి తీసుకొచ్చారు. ఆర్మీ, నేవీ అధికారులు సైనిక వందనం సమర్పించగా అంత్యక్రియలు నిర్వహించారు.