funded
-
వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూత బడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపి వేసింది. బెంగళూరుకు చెందిన షాప్‌ఎక్స్ ఈ మేరకు దివాలా పిటీషన్ దాఖలు చేసింది. దివాలా (ఐబిసి) కోడ్, 2016 సెక్షన్ 10 ప్రకారం దివాలా కోసం దరఖాస్తు చేసినట్టు కంపెనీ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ (MCA) ఫైలింగ్‌లో తెలిపింది. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. . షాప్‌ఎక్స్ -
నవాజ్ షరీఫ్‌కు బిన్ లాడెన్ ఆర్థిక సాయం
ఇస్లామాబాద్: అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆర్థిక సాయం అందిస్తుండేవాడని అమెరికాలో పాక్ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్ తాజాగా బయటపెట్టారు. ఆమె గతంలో నవాజ్ షరీఫ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ‘‘అవును, లాడెన్ ఒక విషయంలో నవాజ్ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్ షరీఫ్‌కు లాడెన్ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’’ అని సయీద్ అబిదా హుస్సేన్ ప్రైవేట్ న్యూస్ చానెల్ జీయో టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011 మేలో పాకిస్తాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. -
క‘రెంటు’ పోరు
- కరెంటు బిల్లులకు కేంద్రం నిధులు - టీ-సర్కార్ ఆదేశాలపై సర్పంచుల అసంతృప్తి - హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయం - రద్దయిన బీఆర్జీఎఫ్ - నేటికీ విడుదల కాని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సాక్షి, మంచిర్యాల : అత్త సొమ్ము.. అల్లుడు దానం చేసినట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం. పల్లెల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు పంచాయతీలకు మంజూరైన 13వ ఆర్థిక సం ఘం నిధుల్లో 80శాతం డబ్బులు విద్యుత్ బకాయిల కోసం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.19.30 కోట్లు వచ్చాయి. వీటిలో 80శాతం నిధులతో బకాయి లు చెల్లిస్తే.. రూ.15 కోట్లు అవుతుంది. మిగిలిన రూ.4.30 కోట్లతో జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో తెలియక సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు.. కేంద్రం ఏటా విడుదల చేస్తున్న వెనకబడి న ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్జీఎఫ్) నిధులను ఇటీవల రద్దు చేసింది. దీంతో పల్లెల అభివృద్ధి పడకేసినట్లయింది. ఇటు టీ-సర్కార్.. ఈ సంవత్సరం రాష్ట్ర ఆర్థిక సం ఘం కింద నయాపైసా విదల్చలేదు. తన గ్రాంట్ల నుంచి ఇంత వరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వని టీ-సర్కార్ కేంద్రం నిధులను కరెంట్ బిల్లులకు చెల్లించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని.. ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే.. ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఆందోళనలు చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. మరోపక్క.. ఏళ్ల క్రితం నాటి బిల్లుల భారమూ ప్రస్తుత సర్పంచులు మోయాల్సిందేన ంటున్న ప్రభుత్వ తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు. తాము అధికారంలో లేనప్పుడు పేరుకుపోయిన బిల్లుల భారం తమపై మోపడం తగదని.. ఆ సమయంలో ఎలాంటి మీటర్ రీడింగులు లేకుండా అధికారులు విద్యుత్ బకాయిలు ఖరారు చేయడాన్ని త ప్పుబడుతున్నారు. టీ-సర్కార్ తీరుకు నిరసనగా న్యాయపోరాటం చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలత స్పష్టం చేశారు. కేంద్రం నిధులపైనే దృష్టి..! పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లింపు భారమంతా కేంద్రం నిధులతోనే పూడ్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయా ప్రభుత్వాలే పంచాయతీల కరెంట్ బిల్లులు చెల్లించేవని సర్పంచులు చెబుతుంటే.. గతంలో కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధుల్లో కోత విధించి ఆయా ప్రభుత్వాలు పంచాయతీలకు డబ్బులు విడుదల చేసేవని ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో మూడు నెలల క్రితం పంచాయతీలకు వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 15శాతం విద్యుత్ బకాయిల కోసం చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చే సిన విషయం తెలిసిందే. సర్పంచులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో ఆ సమయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇప్పుడు తాజాగా.. 80శాతం నిధులు విద్యుత్ బకాయిల కోసం ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికార పార్టీ సర్పంచుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం నిధులతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి పథకాల నిర్వహణ, స్టేషనరీ, కమాటీల వేతనాలు ఇతర పనులు చేపడతారు. ఈ నిధుల్లోంచి ఎక్కువగా విద్యుత్ బకాయిల కోసం చెల్లిస్తే.. క్షేత్రస్థాయిలో పై పనుల నిర్వహణ ఏమిటని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో టీ-సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం - సర్పంచుల మధ్య దూరాన్ని పెంచుతోంది. ప్రశ్నార్థకంగా పల్లెల అభివృద్ధి కేంద్ర నిధుల నుంచి 80శాతం కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్జీఎఫ్) రద్దు కావ డం.. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఇంత వరకు విడుదల కాకపోవడంతో జిల్లాలో పల్లెల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకాల ద్వారా ఒక్కో పంచాయతీకి జనాభాను బట్టి రూ.60వేల నుంచి రూ.2లక్షల వరకు మంజూరవుతుంది. మరోపక్క.. జిల్లాలో ఉన్న 866 గ్రామ పంచాయతీల నుంచి ఏటా వివిధ రకాల పన్నులు రూ.17 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా.. సిబ్బంది కొరతతో ఆశించిన మేరకు వసూళ్లు జరగడం లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.9 కోట్లకు మించి పన్నులు వసూలు కావడం లేదు. ఫలితంగా పల్లెలు సమస్యల వలయాల్లో చిక్కుకుపోతున్నాయి. ఇప్పుడు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 80శాతం కరెంట్ బిల్లుల కోసం ఖర్చు చేస్తే జిల్లాలో పల్లెల పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి పోచయ్యను సంప్రదించగా..‘ప్రభుత్వ ఆదేశాల మేరకు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 80శాతం డబ్బులు కరెంట్ బిల్లుల కోసం కేటాయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మిగిలిన నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు’ అని చెప్పారు. -
జంగుబాయి సన్నిధిలో నేడు దీపోత్సవం
- నేటి నుంచి నెలరోజులపాటు ఉత్సవాలు - దేవతల శుద్ధీకరణ - తరలిరానున్న వేలాది మహిళలు - సౌకర్యాలపై దృష్టిసారించని అధికారులు - రూ.10 లక్షలు మంజూరు చేసినా ఇంకా అందని వైనం కెరమెరి : లక్షలాది మంది ఆదివాసీలు పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది రెండుసార్లు కొనసాగే ఉత్సవాలు ప్రతీ సంవత్సరం పుష్యం మాసం నుంచి ప్రారంభమై నెలరోజులుపాటు కొనసాగుతాయి. మే 19, తర్వాత డిసెంబర్ 25న కొనసాగుతాయి. మండలంలోని పరంధోళి గ్రామ పంచాయతీకి చెందిన ముకద్దంగూడ గ్రామ అడవుల్లో జంగుబాయి దేవత కొలువై ఉంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దైవక్షేత్రానికి ఇటీవల ప్రాధాన్యత వచ్చింది. నియమ నిష్టతో ఆదివాసీలు పూజలు చేస్తారు. నేడు రాత్రి 8ః00 గంటలకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవం జరగనుంది. దేవతా విగ్రహాలకు శుద్ధి ఇటీవల చంద్ర గ్రహణం ఉండడంతో నేటి నుంచి ఎనిమిది గోత్రాలకు చెందిన ఆదివాసీలు జంగుబాయి ఆలయ సన్నిధిలో కొలువుదీరిన దేవతా విగ్రహాలను టొప్లకసలో శుద్ధి చేస్తారు. ఎవరికి వారు మేళాలతో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జంగుబాయి, పోచమ్మ, రావుడ్తో పాటు మరో ఏడు దేవతా విగ్రహాలను శుద్ధి చేస్తారు. విత్తనాలు చూపించడమే ప్రత్యేకత మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని విత్తనాలను జంగుబాయికి చూపిస్తారు. పంటపొలాల్లో ఏఏ రకాల విత్తనాలు వేస్తున్నామో వాటిన్నిటిని దేవతకు చూపిస్తే పంటల్లో దిగుబడి బాగా వస్తుందని వారి నమ్మకం. నిధులు మంజూరైన నిర్లక్ష్యమే రెండునెలలక్రితం జంగుబాయి ఆలయ అభివృద్ధికోసం ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినా అవి నేటికి ఆల య కమిటీ సభ్యులకు ఐటీడీఏ అధికారులు సమాచారం ఇవ్వలేదు. గతంలోనే ఐటీడీఏ పీవో ఖాతాలో జమ చేసినట్లు తెలిసిందని ఆలయ కమిటీ చైర్మన్ మరప బాజీరావు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కాక్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్డు, తాగునీటికి కష్టం జంగుబాయి ఆలయానికి వెళ్లేందుకు సరైనసౌకర్యం లేకపోవడంతో ఆదివాసీ భక్తులు ఇబ్బంది పడక తప్పదు. రాళ్లు రప్పలతో కూడుకున్న దారి ఉండడంతో ఎడ్లబండ్లు రావడం కష్టంకానుంది. తాగునీటి కోసం ఎలాంటి సౌకర్యం లేదు. సమీపంలోని టొప్లకసలో ఉన్న నీటిని ఎడ్ల బండ్లపై తీసుకరాక తప్పదు. తాగునీటికి, స్నానాలకు అవేనీటిని వాడడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గుహలో బస చేసిన జంగుబాయి ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవతా గుహలో కొలువైంది. పోచమ్మ ఆలయం వెనుక భాగంలోంచి కప్లైకి పై భాగంలో జంగుబాయి దేవి ఉంది. అది పూర్తిగా గుహకావడంతో భక్తులు కూర్చునే నడుస్తారు. చిమ్మని చీకటిలో దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. మనుసుల్లో ఉన్న కోర్కెలు తీర్చే తల్లిగా ఆదివాసీలు భావిస్తారు. ఆరు గోత్రాలకు చెందిన కుటుంబాలు ఒకే వేదికపై వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులైన వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హైం రం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారెవరూ కూడా వాహనాలను ఉపయోగించకుండా కేవలం కాలిబాట, ఎడ్ల బండ్లపై వందలాది కిలో మీటర్లు రవాణా సాగిస్తారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పూజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికి కూడా మొక్కులు తీర్చుకుంటారు -
రూ.700 కోట్లు కోల్పోయిన రాష్ట్రం
ప్రభుత్వ వైఫల్యమే కారణం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్వాకం వల్ల 13వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో రావాల్సిన రూ.700 కోట్లను రాష్ట్రం కోల్పోయింది. నిధుల వినియోగానికి సంబంధించి సకాలంలో వినియోగ పత్రాలను సమర్పించడంలో ప్రభుత్వం విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్థిక సంవత్సరం చివరిరోజు మంగళవారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఖజానాకు మొత్తం రూ.5,000 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ నుంచి గట్టెక్కింది. అయితే చేబదులు నుంచి ఇంకా గట్టెక్కలేదు. ఓవర్ డ్రాఫ్ట్ నుంచి గట్టెక్కడం తో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాలని నిర్ణయించారు. తాజాగా విడుదలైన నిధుల్లో రెగ్యులర్‌గా రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఉన్నప్పటికీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. 13వ ఆర్థిక సంఘం కింద మంగళవారం రాత్రి రూ.309 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. మరో రూ.700 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ నిధులు విడుదల కాలేదు. 13వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిపోవడంతో ఇక ఆ నిధుల గురించి మరిచిపోవాల్సిందే. ఈ రూ.700 కోట్లలో కొన్ని నిధులు స్థానిక సంస్థలకు, మరికొన్ని నిధులు ప్రత్యేక అవసరాల కోసం ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.12,000 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్రం రెండు దశల్లో కలిపి రూ.2,300 కోట్లు విడుదల చేసింది. గత నెల తొలివారంలో రూ.500 కోట్లు, మంగళవారం రాత్రి రూ.1,800 కోట్లు విడుదల చేసింది. -
కేంద్ర నిధుల బాధ్యత మీదే
మంత్రులకు స్పష్టం చేసిన సీఎం మంత్రుల పనితీరుపై ఆగ్రహం స్వైన్‌ఫ్లూపై ఎందుకు స్పందించడంలేదని మండిపాటు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టే బాధ్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులపై ఉంచారు. రాష్ర్టంలో నిధుల కొరత, ఇతర అంశాలపై సోమవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు తాను ఒక్కడినే పదిమార్లు ప్రధాన మంత్రి చుట్టూ తిరిగాను కాబట్టి నిధులు వస్తాయనే భరోసాతో ఉండొద్దని మంత్రులకు చెప్పారు. మంత్రులు వారి శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీకి పంపి నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసి నిధులు వచ్చేలా చూడాలని అన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారని, ప్రణాళికా సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులను రాబట్టాలని చెప్పారు. మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మినహా మిగతా వారు శాఖలపై పట్టు సాధించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరే వారి శాఖలపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారని, మిగిలిన వారు పట్టించుకోవటంలేదన్నారు. వారి శాఖల్లో జరుగుతున్న ప్రగతిని ఐప్యాడ్ ద్వారా వివరించమని సీఎం కోరగా కొద్దిమందే స్పందించారు. దీంతో.. మంత్రులు రెండు రోజుల్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం చెప్పారు. సొంత జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో పర్యటించాలని, ప్రతి శనివారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టంచేశారు. రాష్ర్టంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోందని పత్రికలు, ప్రసార సాధనాల్లో వార్తలు వస్తున్నా ఎందుకు స్పందించలేదని మంత్రులను ప్రశ్నించారు. తాను దావోస్‌లో ఉన్న సమయంలో కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సోమరాజు ఫోన్ చేసి రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి గురించి చెప్పారని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారని, తనను కూడా వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలని సూచించారని చెప్పారు. ఒక ప్రైవేటు వైద్యుడు తనను అప్రమత్తం చేశారని, అదే పనిని సంబంధిత శాఖ మంత్రి, అధికారులు ఎందుకు చేయలేదన్నారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్థానిక దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో ఎయిర్కోస్టా 79వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఐరిస్ ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న సీఎం కాన్వాయ్7 విజయవాడ, గుంటూరు జిల్లా పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా బాబు కాన్వాయ్ సోమవారం రాత్రి కనకదుర్గమ్మ వారధిపై 10నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. చేనేత రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆప్కోలోని చేనేత వస్త్రాల నిల్వలను 20 శాతం రిబేట్‌పై రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికిగాను రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చుకానుందన్నారు. ఈ మేరకు మంగళగిరిలో సోమవారం ఓ కళాశాల ఆవరణలో జరిగిన చేనేత చైతన్య సదస్సులో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 6.50 లక్షల కుటుంబాలు చేనేతపై ఆధారపడ్డాయని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రూ.165 కోట్ల మేరకు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తామని, కార్మికులెవరూ రుణాలు చెల్లించొద్దని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా నూలుపై 20 శాతం సుంకాన్ని తగ్గించనున్నామని, దీనిలో 10 శాతం కార్మికునికి, 10 శాతం సంఘాలకు అందజేస్తామన్నారు. చేనేత కార్మికులకు షెడ్, ఇల్లు, ఆరోగ్య బీమా కల్పించి, 50 ఏళ్లు నిండిన కార్మికులకు పింఛన్లు ఇస్తామన్నారు.