Furniture showroom
-
IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ
ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపనుంది. హైదరాబాద్‌తో మొదలు స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్ ఇన్ వన్ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్‌లో కొత్త సిటీ స్టోర్స్ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది. సిటీ స్టోర్లు విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్ టెక్నిక్‌కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఎక్కడంటే ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్‌లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ధరల తగ్గింపు సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్ బేస్‌ను సేల్స్‌ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన. చదవండి: పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్ -
సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు!
చీమకుర్తి(ప్రకాశం జిల్లా): ఆ మాల్ వద్దకు ముగ్గురు వచ్చారు. ఒకరు బయట కాపలా ఉన్నారు.. ఇద్దరు లోపలకు వెళ్లారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే డబ్బులు లెక్కేసుకున్నారు. పావు గంటలో పని ముగించేసుకొని గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన దారిలోనే వెళ్లారు. గురువారం తెల్లవారు జామున చీమకుర్తిలోని కర్నూల్ రోడ్డుకు సమీపంలో ఉన్న బీవీఎస్ఆర్ ఫర్నిచర్ మాల్లో ఈ దొంగతనం జరిగింది. షాపు యజమాని సతీష్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ ఆస్పత్రికి సమీపంలో ఉన్న బీవీఎస్ఆర్ ఫర్నిచర్ మాల్ నాలుగంతస్తులు ఉంటుంది. మొదటి అంతస్తులో దొంగతనం జరిగింది. రెండో అంతస్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, మూడో అంతస్తులో జిమ్ నిర్వహిస్తున్నారు. నాలుగో అంతస్తులో షాపు యజమానులు నివాసం ఉంటున్నారు. షాపునకు బయట, షాపు లోపల ఉన్న సీసీ పుటేజీలో ఎంత మంది దొంగలు వచ్చారు. వారు ఎలా దొంగతనం జరిగిందనే విషయాలు పూర్తిగా సీసీ పుటేజీలో రికార్డు అయింది. రోజూలాగే బుధవారం కూడా షాపులో ఫర్నిచర్‌ను అమ్మిన డబ్బులు క్యాష్ కౌంటర్లో ఉంచి దానికి తాళం వేసి రాత్రి పైన నాలుగో అంతస్తులో యజమాని కుటుంబం నిద్రించింది. దొంగతనానికి ముగ్గురు వచ్చినట్లు బయట ఉన్న సీసీ పుటేజీలో రికార్డు అయింది. ఒకరు బయట ఉన్నారు. మిగిలిన ఇద్దరూ మొదటి అంతస్తులో డోర్‌ను చాకచక్యంగా తీశారు. లోపల క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న అద్దాల బాక్స్‌లో అమ్మకానికి తెచ్చన రూ.4 లక్షల విలువ చేసే సెల్ఫోన్ల జోలికి వెళ్లలేదు. యజమాని సెల్‌ఫోన్ రూ.70 వేలు ఉంటుంది. దాన్ని కూడా వారు టచ్ చేయలేదు. అదే అంతస్తులో విలువైన సామగ్రి, రెండో అంతస్తులో విలువైన ఫ్రిజ్‌లు, ఏసీలు కూడా ఉన్నాయి. వాటిలో వేటిని తీసుకోకుండా కేవలం కౌంటర్లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే లెక్కేసుకున్నారు. వేకువ జామున 3.15 గంటలకు మొదలైన దొంగతనం మొత్తం పావుగంట సమయంలో ముగించేసి వచ్చిన దారిలోనే వెళ్లినట్లు సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందని యజమాని పోలీసులకు తెలిపారు. షాపు డోర్ లాక్ చేయకుండా వేలితో లోపల గడిని తీసే విధంగా ఉందని, దాన్ని తెలిసిన వారు తప్ప మిగిలిన వారు తీసే అవకాశం లేదని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. షాపు యజమాని బొమ్మిశెట్టి సతీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగశివారెడ్డి, క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. వేలిముద్రలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
భారీ అగ్ని ప్రమాదం: మెట్రో సేవలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా మరోవైపు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఫర్నిచర్ మార్కెట్లో శుక్రవారం ఉదయం మంటలంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5.55 గంటలకు మంటలు చెలరేగాయని, 17 ఫైర్ ఇంజీన్లు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రాధమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ మెజెంటా లైన్‌లోని మెట్రో రైలు సర్వీసులను ఈ అగ్నిప్రమాదం ప్రభావితం చేసింది. మంటలను అదుపులోకి తెచ్చే వరకు షాహీన్ బాగ్ బొటానికల్ గార్డెన్ స్టేషన్ల మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. Delhi: Fire broke out in a furniture market in Shaheen Bagh near Kalindi Kunj metro station, early morning today. 17 fire tenders present at the spot. Fire-fighting operation underway. pic.twitter.com/Ug1ilDegJm — ANI (@ANI) June 21, 2019 -
పని చేస్తున్న సంస్థకే కన్నం
బంజారాహిల్స్ (హైదరాబాద్) : పని చేస్తున్న సంస్థకే కన్నం వేసి దొరికిపోయాడు ఓ లిఫ్ట్‌బాయ్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలను శుక్రవారం ఇన్స్పెక్టర్ ముత్తు వెల్లడించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన కట్టా ఏసు(20) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్‌లో ఉంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో లుసాకో ఇటాలియా ఫర్నీచర్ షాప్‌లో లిఫ్ట్బోయ్గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఏసు జీతం సరిపోకపోవడంతో పని చేస్తున్న షాపులోనే దొంగతనం చేయడానికి పథకం వేశాడు. కొన్ని రోజుల క్రితం షోరూం మూసివేసిన తర్వాత వెంటిలేటర్లో నుంచి లోపలికి ప్రవేశించి క్యాష్‌బాక్స్‌లో ఉన్న రూ. 60 వేల నగదు దొంగిలించాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఏసును నిందితుడిగా గుర్తించారు. విచారించగా నాలుగు నెలల క్రితం ఇదే సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌తో పాటు రెండు అలంకరణ వస్తువులను కూడా చోరీ చేసినట్లు అంగీకరించాడు.