సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా మరోవైపు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఫర్నిచర్ మార్కెట్లో శుక్రవారం ఉదయం మంటలంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 5.55 గంటలకు మంటలు చెలరేగాయని, 17 ఫైర్ ఇంజీన్లు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రాధమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ మెజెంటా లైన్‌లోని మెట్రో రైలు సర్వీసులను ఈ అగ్నిప్రమాదం ప్రభావితం చేసింది. మంటలను అదుపులోకి తెచ్చే వరకు షాహీన్ బాగ్ బొటానికల్ గార్డెన్ స్టేషన్ల మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
Delhi: Fire broke out in a furniture market in Shaheen Bagh near Kalindi Kunj metro station, early morning today. 17 fire tenders present at the spot. Fire-fighting operation underway. pic.twitter.com/Ug1ilDegJm
— ANI (@ANI) June 21, 2019
Comments
Please login to add a commentAdd a comment