బంజారాహిల్స్ (హైదరాబాద్) : పని చేస్తున్న సంస్థకే కన్నం వేసి దొరికిపోయాడు ఓ లిఫ్ట్‌బాయ్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలను శుక్రవారం ఇన్‌స్పెక్టర్ ముత్తు వెల్లడించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన కట్టా ఏసు(20) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని శ్రీరాంనగర్‌లో ఉంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో లుసాకో ఇటాలియా ఫర్నీచర్ షాప్‌లో లిఫ్ట్‌బోయ్‌గా పని చేస్తున్నాడు.
జల్సాలకు అలవాటుపడ్డ ఏసు జీతం సరిపోకపోవడంతో పని చేస్తున్న షాపులోనే దొంగతనం చేయడానికి పథకం వేశాడు. కొన్ని రోజుల క్రితం షోరూం మూసివేసిన తర్వాత వెంటిలేటర్‌లో నుంచి లోపలికి ప్రవేశించి క్యాష్‌బాక్స్‌లో ఉన్న రూ. 60 వేల నగదు దొంగిలించాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఏసును నిందితుడిగా గుర్తించారు. విచారించగా నాలుగు నెలల క్రితం ఇదే సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌తో పాటు రెండు అలంకరణ వస్తువులను కూడా చోరీ చేసినట్లు అంగీకరించాడు.
పని చేస్తున్న సంస్థకే కన్నం
Published Fri, Oct 16 2015 5:08 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement