further
-
భవిష్యత్తులో మొబైల్ బిల్లు తగ్గుతుందా?
సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత మొబైల్ ఫోన్ బిల్లుల బాదుడు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా గత ఆరునెలల్లో సగటు నెలవారీ మొబైల్ బిల్లుల్లో 30నుంచి 40శాతం తగ్గిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి ఉంటుందే అనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా మొబైల్ వినియోగదారులు ఆశించిన ధరల క్షీణతను పొందలేరని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. టెలికాం కంపెనీల ఆదాయ, మార్జిన్ల అధిక ఒత్తిళ్ల భారం వినియోగదారుడిపై పడనుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోదీంతో కస్టమర్లు డేటా, ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతేకాదు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగనుందట. భవిష్యత్‌లో ఫోన్ బిల్లులు మరింత తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్‌పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసర్చ్ తెలిపింది. అయితే వివిధ ప్యాకేజీల మధ్య వ్యత్యాసం రూ. 100లకు బదులుగా 50రూపాయల కంటే తక్కువుంటే కస్టమర్లపై భారం ఫ్లాట్‌గానే అంచనా వేయవచ్చని కౌంటర పాయింట్ రీసెర్చ్ సత్యజిత్ సిన్హా వ్యాఖ్యానించారు. మరోవైపు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగుతాయని మరో అంచనా. అలాగే గత 9-10 నెలల్లో మొత్తం చందాదారులందరిలో నాలుగుశాతం ఎక్కువ ఆఫర్లను ప్యాకేజీలవైపు మళ్లారని , రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నిష్పత్తి 50 శాతానికి పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది. కాగా జియో ప్రవేశం తర్వాత ఎయిర్టెల్, ఐడియా సహా పలు టెలికాం సంస్థలు టారిఫ్‌లను తగ్గించడం సహా ఇతర ఆఫర్ల వల్ల టెలికాం సంస్థల ఆదాయానికి భారీగా గండిపడినట్లు తెలుస్తోంది. 2016 జూన్ నుంచి 2017 డిసెంబరు మధ్య టెలికాం కంపెనీలు దాదాపు 9.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయని ఇటీవల ఓ నివేదికలో తేలింది. ఈ కారణాల వల్ల భవిష్యత్‌లో టారిఫ్‌లను తగ్గించకూడదని టెలికాం సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్ల సౌలభ్యం కోసం ఉన్న టారిఫ్‌లలోనే ఎక్కువ డేటా, మరిన్ని ఉచిత సదుపాయాలను అందించే అవకాశాలున్నాయని సమాచారం. -
తీరు మారేదెన్నడో..!?
- ఉపాధ్యాయ బదిలీలపై కార్యరూపం దాల్చని మంత్రి ప్రకటన - నేటికీ విడుదల కాని షెడ్యూల్ - దొడ్డిదారిన బదిలీలకు సన్నాహాలు - ఆందోళనలో ఉపాధ్యాయులు రాయవరం (మండపేట): వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామంటూ స్వయంగా విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. సెలవుల్లోనే బదిలీ ప్రక్రియ పూర్తయితే అన్ని విధాలా మేలు కలుగుతుందని ఉపాధ్యాయులు భావించారు. అయితే నేటికీ బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో మంత్రి మాట నీటిమీద రాతగా మారిపోనుందా..అనే అనుమానం ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు దొడ్డిదారిన విద్యాశాఖలో బదిలీలకు తెరతీయడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరు మారేదెన్నడో.. వేసవిలోనే ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రతిసారీ డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించడం వల్ల పాఠశాలల్లో విద్యావ్యవస్థకు భంగం కలగకుండా ఉంటుంది. ఉపాధ్యాయుల పిల్లలను బదిలీ అయిన చోట పాఠశాలల్లో చేర్పించడానికి కూడా అవకాశం కలుగుతుంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుంది. 2015లో నిర్వహించిన బదిలీలను కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తామని చెప్పిన విద్యాశాఖ చివరకు మధ్యలో చేపట్టింది. వివిధ రకాల నిబంధనలు పెట్టి కాలయాపన చేసి చివరకు బదిలీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. చివరకు అక్టోబరు మాసాంతానికి ఆ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో సుమారు 19 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2015లో బదిలీలు జరిగిన సమయంలో జిల్లాలో సుమారు రెండు వేల మంది వివిధ ప్రాంతాలకు బదిలీలయ్యారు. వచ్చే నెలలోనేనా... ఉపాధ్యాయులు బదిలీలు జరుగుతాయా? జరగవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు పొందుతున్నారు. ఉపాధ్యాయ శిక్షణలు వచ్చే నెల ఐదో తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే వచ్చే నెలలోనే షెడ్యూల్ విడుదలై విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకూ బదిలీల షెడ్యూల్ ప్రకటించని ప్రభుత్వం మరోవైపు దొడ్డిదారిన బదిలీలకు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అటువంటివి లేకపోయినా రాష్ట్రంలో పలు జిల్లాల్లో దొడ్డిదారి బదిలీలు జరగడంతో రెండు రోజుల కిందట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆయా డీఈవో కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. పెడచెవిన పెడుతున్న ప్రభుత్వం.. బదిలీలు వేసవి సెలవుల్లోనే చేపట్టాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీనివల్ల విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. – పి.సుబ్బరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయు. అందుకే కాలయాపన.. దొడ్డిదారిన బదిలీలు చేసుకునేందుకే ప్రభుత్వం బదిలీల షెడ్యూల్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. పలు రకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం దొడ్డిదారి బదిలీలకు తెరతీస్తోంది. – టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ తొలుత పదోన్నతులు ఇవ్వాలి.. బదిలీ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. దీనికి ముందే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి. బదిలీలు జాప్యం జరగడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారు. – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయు. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే తదుపరి జూన్ రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు ద్రవ్యోల్బణం ఫెడ్ టార్గెట్ రేటు కంటే తక్కువగానే ఉంది. కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే.