GADIKOTA srikantreddy
-
‘బాబు’ పెద్ద ఆర్థిక నేరస్తుడు
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా పెద్ద ఆర్థిక నేరగాడు దేశంలో మరెవ్వరూ లేరని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకొని, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కంటే పెద్ద దొంగ ఎవరుంటారని ప్రశ్నించారు. శని వారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ పోరాడుతుంటే సీఎం, టీడీపీ నాయకులు అవహేళన చేశారని, జల్లికట్టు స్ఫూర్తితో అన్ని పార్టీలు కలిసి ఉద్యమిద్దామని పిలు పునిస్తే పందులు, కుక్కల ఫైట్ కోసం పోరాటం చేయాలా అని ఎగతాళి చేశారని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నాలు, దీక్షలు, యువభేరీల ద్వారా వివరించి, ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం చూసి బాబు స్టాండ్ మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్ జగన్ ప్రకటించగానే టీడీపీలో కదలిక మొదలైందన్నారు. వైఎస్ఆర్సీపీకి మైలేజీ వస్తుందనే ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకున్నారని, రాత్రి 9 గంటలకు అవిశ్వాసంపై నిర్ణయం తీసుకొని 10గంటలకల్లా అన్ని పార్టీలు తమకే మద్దతు ఇస్తున్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దాదాపు అన్ని ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. హోదా ఇవ్వనని చెప్పిన బీజేపీతో వైఎస్ఆర్సీపీ పొత్తు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించకుండా కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ, బీజేపీలు నాటకాలాడుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ తప్పులన్నింటికీ ప్రజ లు తగిన శిక్ష వేస్తారని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మాజీ అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, జెడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, బి. కిషోర్ కుమార్ పాల్గొన్నారు. -
‘చక్కెర’ ప్రైవేటీకరణకు కుట్ర
చంద్రబాబుపై ధ్వజమెత్తిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధ్యయనం కోసం కమిటీ వేసిన సర్కారు అందులో అందరూ ప్రైవేటు ఫ్యాక్టరీల యజమానులే నష్టాలొస్తున్నాయని చెప్పించి వందిమాగధులకు కట్టబెట్టే యత్నం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని సహకార పంచదార ఫ్యాక్టరీలను తన వంది మాగధులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నపుడు నష్టాలొస్తున్నాయనే నెపంతో ఎలాగైతే ప్రభుత్వ రంగ సంస్థలను తన వారికి ధారాదత్తం చేశారో ఇపుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పచ్చచొక్కాల కన్ను ఏ ప్రభుత్వ సంస్థపై పడుతుందో దానికి నష్టాలొస్తున్నాయని చెప్పి తన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. 2004లో ఓటమి పాలయ్యాక తాను మారానని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఏ మాత్రం మారలేదని నిరూపించుకుంటున్నారన్నారు. ఏపీలోని పంచదార ఫ్యాక్టరీల పనితీరు అధ్యయన ం కోసం తాజాగా నియమించిన కమిటీయే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనేం చెప్పారంటే... ప్రైవేటీకరణకు ముందు అధ్యయనం పేరుతో ఇలా కమిటీని వేయడం, నష్టాలొస్తున్నాయని వారితో తూతూ మంత్రంగా నివేదిక ఇప్పించడం, ఆ తరువాత తన వాళ్లకు కట్టబెట్టడం అనేది చంద్రబాబు పథక రచనలో భాగం. పంచదార ఫ్యాక్టరీల పనితీరును అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలో అందరూ ప్రయివేటు పంచదార ఫ్యాక్టరీల యజమానులే ఉండటం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన జారీచేసిన 289 నంబరు జీవో ద్వారా ఏర్పాటైన కమిటీలో తూర్పుగోదావరిలోని సర్వారాయ షుగర్స్‌కు చెందిన సుధాకర్ చౌదరి, ఖమ్మం జిల్లా పాలేరు పంచదార ఫ్యాక్టరీ ప్రతినిధి భరద్వాజ, బ్రహ్మ అండ్‌కో ఆడిటింగ్ క ంపెనీకి చెందిన శ్రీనివాస మోహన్‌లు సభ్యులుగా ఉన్నారు. బ్రహ్మ అండ్‌కో కంపెనీ అధినేత దేవినేని సీతారామయ్య ఎన్టీఆర్ ట్రస్టులో ఒక సభ్యుడు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పాలేరు షుగర్స్‌ను కారు చౌక ధర 5 కోట్ల రూపాయలకే కట్టబెట్టిన మధుకాన్ కంపెనీ ప్రతినిధి భరద్వాజ. సుధాకర్ చౌదరి కూడా టీడీపీకి సన్నిహితుడే. పంచదార ఫ్యాక్టరీలన్నింటినీ ఒక పథకం ప్రకారం ప్రైవేటీకరించే దురుద్దేశంతోనే వీరిని సభ్యులుగా నియమించారు. ఒక కుక్కను చంపే ముందు పిచ్చికుక్క అని ముద్ర వేసిన చందంగానే... ఒక ప్రభుత్వ రంగ సంస్థను తన వారికి ధారాదత్తం చేసే ముందు దానికి నష్టాలు వస్తున్నాయని చెప్పించడం చంద్రబాబుకు అలవాటు. కోవూరు(నెల్లూరు) షుగర్స్ ఫ్యాక్టరీ పనితీరు, దాని ఆధునీకరణ అధ్యయనం కోసం 290 జీవోను జారీ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అధ్యయనానికి ప్రైవేటు ఆపరేటర్లయిన కేశినేని, దివాకర్ ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో కమిటీని వేసినట్లుగా చంద్రబాబు వైఖరి ఉంది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని కూడా తన ఘనతగా చెప్పుకుంటూ పుస్తకాల్లో కూడా రాశారు. గత ఎన్డీయే హయాంలో దేశం మొత్తం మీద 84 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తే అందులో 54 ఆంధ్రప్రదేశ్‌లోనివే. తన పాలనలో ప్రభుత్వ సంస్థలకు నష్టాలొస్తే దాన్ని కూడా ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. తెరవెనుక చినబాబు ► చక్కెర ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ యత్నం వెనుక చినబాబు హస్తం ఉంది. ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉంటూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. చిన్నబాబును కాబోయే ముఖ్యమంత్రిగా తన మంత్రులతో చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్‌లను చినబాబే నిర్దేశిస్తున్నారు. ఎక్కడ ఏ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలో కూడా ఆయనే చెబుతున్నారు. ► ఇంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రభుత్వ సంస్థలను పందికొక్కుల్లాగా దోచుకుంటూ ఇంకొకరిని అవినీతి పరులంటూ నిందించే నైతికత టీడీపీ వారికెక్కడిది? ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు తన మనుషులకు దత్తం చేయకుండా వైఎస్సార్సీపీ తుదికంటా పోరాడుతుంది.