Gadwal court
-
ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్
గద్వాలటౌన్/గద్వాల క్రైం: మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, పార్టీ కేడర్ నియామకాలు చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం గద్వాల కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. జగన్‌ను మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. ఈ నెల 5న గద్వాల మండలం మేళ్లచెర్వులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ విద్యార్థి వేదిక నేత నాగరాజును కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పోలీసులు అందించిన సమాచారం మేరకు మావోయిస్టుల రిక్రూట్మెంట్కు సహకరిస్తున్నారన్న అభియోగంతో 8 మందిపై కేసులు నమోదు చేశారు. నాగరాజును ఏ1గా, జగన్‌ను నాలుగో నిందితుడిగా నమోదు చేశారు. కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపిన పోలీసులు మిగతా వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో జరిగే నష్టాలను సమాజానికి తెలియజేస్తూ వ్యతిరేకించడం వల్లే మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారన్న ముద్ర వేస్తున్నారని తెలుగు అధ్యాపకురాలు, జగన్ భార్య రజని ఆరోపించారు. -
కన్ను పడితే కన్నమే..
సాక్షి, గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. ఎంతమంది కాలనీలో సంచరిస్తున్నా.. పోలీసుల నిఘా.. పెట్రోలీంగ్.. అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నా వారి కన్నుపడితే మాత్రం కన్నం పడాల్సిందే.. అనుమానం రాకుండా తమ చేతివాటంతో ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకెళ్తారు.. రెండురోజులకు ఒక చోరీ చేపడుతూ దొరబాబుల్లా తప్పించుకుంటున్నారు.. ఇందుకు జోగుళాంబ గద్వాల జిల్లా వీరికి స్వర్గధామంగా మారింది.. అంతుచిక్కని ఆట విడుపుతో జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నారు.. గత రెండు నెలల్లోనే ఇప్పటి వరకు గద్వాల, అయిజ, మానవపాడు, శాంతినగర్ మండలాల్లో 14 చోరీలు చేయగా.. రూ.8,70,500 నగదు, 65 తులాల బంగారం, 57 తులాల వెండి ఆభరణాలు కలిపి రూ.21,22,230 విలువైన సొత్తు మాయమైపోయింది.. అంతర్రాష్ట్ర ముఠా పనేనా..? గత కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండటంతో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు జిల్లాకు వచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చోరీలు జరుగుతున్న తీరును బట్టి చూస్తే పక్కా పథకం ప్రకారమే చేస్తున్నారు. ముఠాలోని సభ్యులు పట్టణంలోనే సంచరిస్తూ ఆయా కాలనీల్లో తాళం వేసిన ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి తరహాలో చోరీలు జరగడం జిల్లాలో ప్రథమంగా ఉంది. అయితే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే చోరీలకు పాల్పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులను సైతం ముఠా సభ్యులు గమనిస్తూ ఎవరికి చిక్కకుండా జిల్లాలోనే సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. గంటల వ్యవధిలోనే.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో సామాన్య ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లలోనే చోరీలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నిత్యం పోలీసుల గస్తీలు, తనిఖీలు, నిఘా ఉన్నప్పటికీ ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఏంచక్కా దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇక పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని ప్రజల్లో ఉన్న భయాందోళనను తొలగించాలి. పోలీసులకు సవాల్ చోరీలకు పాల్పడిన దుండగులు ఎవరనే అంశంపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిసారించింది. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు.. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పలు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జాదుగాళ్లు తప్పించుకుంటున్నారు. కేసుల ఛేదనలో పలు పోలీసు బృందాలు విస్తృతంగా అధ్యయనం చేసినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. చోరీ ఘటనలు ఇవిగో.. - అక్టోబర్ మొదటి వారంలో పలు ఇళ్లలో చోరీ ఘటనలు చోటుచేసుకోగా.. రూ.5 వేలు, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. - అక్టోబర్ 13న ఎక్లాస్పురం నర్సింహారెడ్డికి చెందిన అయిజలోని లక్ష్మీనర్సింహా ట్రేడర్స్ దుకాణంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.3.40 లక్షల విలువైన వస్తు సామగ్రిని ఎత్తుకెళ్లారు. - అక్టోబర్ 27న గద్వాలలోని కోర్టు సమీపంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.90 వేల నగదు, 10 తులాల బంగారం అపహరించారు. - నవంబర్ 6న శాంతినగర్‌కు చెందిన సువర్ణ అనే మహిళ పని నిమిత్తం కర్నూలు బస్సులో పెబ్బేరుకు వెళ్తుండగా ఆమె వద్ద ఉన్న 2.50 గ్రాముల బంగారం అపహరించారు. - నవంబర్ 8న గద్వాల పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. అయితే తాళం వేసి ఉండడంతో మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న రూ.41 వేల నగదు ఎత్తుకెళ్లారు. - నవంబర్ 9న పట్టణంలోని షేరెల్లివీధికి చెందిన రాఘవచారి కుటుంబ సభ్యులతో కలిసి కేటీదొడ్డి మండలంలోని వెంకటాపురంలో జాతరకు వెళ్లారు. గమనించిన దొంగలు మధ్యాహ్న సమయంలో ఇంట్లోకి చొరబడి 55 తులాల బంగారం, 57 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఇలా గడిచిన 41 రోజుల వ్యవధిలోనే 14 దొంగతనాలు చేసి.. భారీగా నగదు, బంగారం ఆభరణాలు అపహరించుకెళ్లారు. త్వరలోనే పట్టుకుంటాం చోరీలు చేస్తున్న వ్యక్తులను త్వరలో పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తాం. అయితే చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తే తెలిసిన వ్యక్తులే చేస్తున్నట్లు తెలుస్తుంది. పథకం ప్రకారమే తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రత్యేక బృందాలు కూపీ లాగుతున్నాయి. ప్రజలు సైతం విలువైన ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – షాకీర్ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల -
ఏడుకొండల వాడికి గద్వాల పంచెలు కానుక
బ్రహోత్సవాల సందర్భంగా శ్రీవారికి ధరింపజేసే ఎరవాడ జోడు పంచెల నేత పూర్తయింది. గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు నియమ నిష్టలతో నేత కార్మికులు గద్వాల ఎరవాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. నాటి నుంచి వస్తున్న ఆచారం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఎరవాడ జోడు పంచెల నేత గురువారం పూర్తయింది. అక్టోబర్ 3 నుంచి 11వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఎరవాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాదీశురాలు శ్రీలతాభూపాల్ లేఖను తీసుకొని శుక్రవారం తిరుపతికి వెళ్లి శ్రీవారి పంచెలను అక్కడి పేష్కార్కు అప్పగించనున్నట్లు పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్ తెలిపారు. 41 రోజులుగా నిష్టతో శ్రీవారి ఎరవాడ జోడు పంచెలను ఐదుగురు చేనేత కార్మికులు పనిచేసి సిద్ధం చేశారు. గద్వాల రాజుల వారసత్వంగా పంచెల సమర్పణ... శతాబ్దాలుగా గద్వాల సంస్థానాదీశులు తమ వంశ పెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీ తిరుమలేశుడికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఎరవాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసునికి ఉత్సవాల మొదటి శుక్రవారం రోజున, విజయ దశమి రోజున ఈ ఎరవాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింప చేస్తారు. గద్వాల సంస్థానాదీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన వెంకటేశ్వరుడికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచెల విశిష్టత.. ఎరవాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచుఉంటుంది. శ్రీనివాసుడికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్ కాలనీలోని మహంకాళి కర్ణాకర్ ఇంటిపై ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక నిష్ట, భక్తి శ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఎరవాడ పంచెల తయారిలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, మేడం రమేష్‌లు పాల్గొన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం - మహంకాళి కర్ణాకర్ సంస్థానాదీశుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని వారి వంశస్తులు కొనసాగింప చేస్తున్నారని, మైసూరు, గద్వాల సంస్థాన దీశులు తిరుమలేషుని సేవకు ప్రత్యేకత ఇచ్చారని మహంకాళి కర్ణాకర్ తెలిపారు. ఐదేళ్లుగా తన నివాసంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. గద్వాల జిల్లా ఆకాంక్ష నెరవేరాలని ఆ వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నామని చెప్పారు. -
అప్పు తీర్చాల్సి వస్తుందని.. అంతమొందించాడు
► 15రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు ► నిందితుడి అరెస్టు, రిమాండ్ అయిజ : అప్పు తీర్చాల్సి వస్తుందని ఏకంగా యజమానినే ఓ వ్యక్తి తుదముట్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును 15రోజుల్లో ఛేదించి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్, ఎస్ఐ రమేష్ అయిజ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. పులికల్‌కు చెందిన కె.చంద్రశేఖర్ (40) మూడేళ్లుగా అయిజ పట్టణంలో రెస్టారెంట్ నిర్వహించేవారు. అందులో కర్నాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా ఉప్పలపాడుకు చెందిన చరణబస్వ అలియాస్ చరణ్ వంటమనిషిగా పనిచేసేవాడు. సుమారు ఆరునెలల క్రితం గల్లాపెట్టెలోని రూ.1.6లక్షలు దొంగలించాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టిస్తే రూ.1.1లక్షలు మాత్రమే ఇస్తానని అంగీకరించాడు. అలాగే గతంలో అప్పుగా తీసుకున్న రూ.42వేలు కలిపి ఉగాది పండగ వరకు చెల్లిస్తానన్నాడు. అయితే యజ మానిని తుదమిట్టిస్తే ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదని పథకం పన్నా డు. అందులోభాగంగా గత నెల 30వ తేదీ అర్ధరాత్రి భరత్‌నగర్‌కాలనీలోని ఇంటి మిద్దెపై ఒంటరిగా నిద్రిస్తున్న చంద్రశేఖర్‌ను కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. ఈ ఘటనపై మరుసటిరోజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం బయటపడింది. నిందితుడు చరణ్‌ను బుధవారం అరెస్టు చేసి గద్వాల కోర్టుకు రిమాండ్‌కు తరలించారు.