చిరునవ్వును పంచండి
‘నిరుపేదల మోముల్లో చిరునవ్వులు పూయిస్తాయనుకునే దేనినైనా దానం చేయొచ్చు. వస్త్రాలు, పుస్తకాలు, నిత్యావసర వస్తువులను మా మాల్లో అందించవచ్చు’ అని అంటున్నారు మంజీరా మాల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గజ్జల వివేకానంద. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ముందుగానే ఆయా వస్తువులను ‘యువత’ సంస్థ సహకారంతో నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంజీరా మజా పేరిట ‘చిరునవ్వును పంచండి’ అంటూ కూకట్‌పల్లిలోని మంజీరా మాల్లో బుధవారం ‘సంప్రదాయ గోలు’ను తెరిచారు. ఇది అక్టోబర్ 1 నుంచి 18వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. ‘రోమియో’ చిత్రం హీరో సాయిరామ్‌శంకర్ తన యూనిట్‌తో ఇందులో పాల్గొన్నారు.