విషపు కాయలు తిని విద్యార్థులు అస్వస్తత
కర్నూలు : విషపు కాయాలు తిని నలుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. పూజిత, ఫిరోజ్, మల్లమ్మ, కుందనలను విషపు కాయలు తిని అస్వస్థతకు లోను కావడంతో వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను పరిక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు.