Gajuwaka Assembly Constituency
-
ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్
-
గాజువాకలో టీడీపీ-జనసేన సిగపట్లు!
పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తేనే దిక్కులేదు.. ఇప్పుడు మీరు పోటీ చేసి ఏం గెలుస్తారు? గాజువాకలో జనసేన నేతలపై టీడీపీ నాయకులు సెటైర్లు పేలుస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ పోటీ చేశారు కనుక ఈసారి గాజువాక తమకే ఇవ్వాలని జనసేన నేతలు పట్టుపడుతున్నారు. పవన్ గెలవలేనపుడు మీకు సీటు ఎందుకివ్వాలని టీడీపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సిగపట్లు మొదలయ్యాయి. ఇంకా రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు మొదలు కాకముందే గాజువాకలో గలాటా మొదలైంది. అసలక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబుకు కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం గాజువాకలో సొంత పార్టీ అభ్యర్థికే చంద్రబాబు ప్రచారం చేయలేదు. పక్క నియోజకవర్గంలో ప్రచారం చేసి పవన్ పోటీ చేస్తున్న గాజువాకలో టీడీపీకి ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈసారి గాజువాక తమకే కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు. జనసేన తరఫున పోటీ చేయడానికి కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోన తాతారావు. గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయాల కోసం తానేమి పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు జనసేనలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గాజువాకలో పోటీ చేయాల్సిందే అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్‌కి మద్దతు తెలిపిందని చెబుతున్నారు. అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జనసేనతో పోలిస్తే టీడీపీనే ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టీడీపీ నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను కూడా పంపుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు మొదలు కాకముందే గాజువాకలో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. జనసేన అధ్యక్షుడికే గాజువాకలో దిక్కులేనపుడు..మామూలు నాయకుడు పటిష్టమైన స్థితిలో ఉన్న వైస్ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనగలడా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడదాకా వెళుతుందో చూడాలి. -
సామాజిక న్యాయానికి ప్రతీక సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్‌కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్‌ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. -
సామాజిక సాధికార బస్సు యాత్ర.. తొమ్మిదోరోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నేటి(సోమవారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర గాజువాక, కాకినాడ రూరల్, మార్కాపురం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. గాజువాక సెంటర్లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. గం. 1.30 ని.లకు మింది గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభం కానుంది. రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉండగా, మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. పిల్లల పార్క్ మీదుగా కంభం సెంటర్‌వరకూ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం గం. 4.30ని.లకు వైఎస్సార్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొననున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మిథున్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.