శ్యామ్‌సంగ్ నుంచి మడతేసే ఫోన్ వచ్చే ఏడాదే..
సియోల్: వచ్చే ఏడాది నుంచి మడుచుకోగల శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ కొరియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ హక్కుల దరఖాస్తును పూర్తి చేసింది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లతోపాటు, వాషింగ్ మెషిన్లూ కూడా పేలిపోవడం, అవినీతి చోటుచేసుకోవడంవల్లే వాషింగ్ మెషిన్ల పనితీరులో లోపాలు వచ్చాయని ఆరోపణలు రావడంవంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్యామ్ సంగ్ సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని భావిస్తోంది.
చాలా ఏళ్లు డిస్ప్లేను మడుచుకోగల ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం శ్యామ్ సంగ్ ఎంతో శ్రమిస్తున్నదని, చివరకు అది పూర్తయిందని 2017లో మార్కెట్లోకి తీసుకొస్తామని జీఎస్ఎంఏ ఎరెనా సంస్థ తెలిపింది. కొత్తగా రానున్న ఫోన్ ను గెలాక్సీ 10గా పిలవనున్నారు. ఇందులో వెనుకకు తీసుకెళ్లే బటన్ కుడివైపు, మెనూ బటన్ ఎడమవైపు, హోం బటన్ ఈ రెండింటి మధ్యలో ఉండనుంది.