త్వరలో ఫేస్బుక్ మెసెంజర్ గేమ్స్
న్యూయార్క్: మనం త్వరలోనే ఫేస్బుక్ మెసెంజర్లో గేమ్స్‌ను ఆడుకోవచ్చు. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయి. ఫేస్బుక్ ఇదివరకే గేమ్స్‌ను డెవలప్ చేసే కంపెనీలతో మెసెంజర్ కోసం గేమ్స్ రూపొందించే చర్చలు జరిపింది. గేమ్స్ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ మెసెంజర్లో గేమ్స్ అనే ఊహ చాలా మందిని ఆక ర్షిస్తోంది. అధిక సంఖ్యాక ప్రజలు మెసెంజర్‌ను వినియోగిస్తున్నారు. కాబట్టి మెసెంజర్లో గేమ్స్ ఆడుకునే ఫీచర్‌ను పొందుపరిస్తే అది గేమ్స్ ఆడే చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుంది.
ఇద్దరు గేమ్ ప్లేయర్ల మధ్య మెసెంజర్ ఒక వారధిగా పనిచేస్తుందా? లేకపోతే ఒక రు మాత్రమే ఆడే గేమ్స్‌ను ప్రవేశపెడుతుందా? అనే అంశాన్ని ఫేస్బుక్ నిర్ణయించాల్సి ఉంది.