ganapathi pooja
-
సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్
న్యూఢిల్లీ: గత నెలలో తన నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. నాడు గణపతి పూజకు మోదీ రావడంపై చెలరేగిన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలేవీ చర్చించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబైలో లోక్‌సత్తా లెక్చర్ సిరీస్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సమావేశమవుతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలను కలిస్తే.. ఇద్దరి మధ్యా ఏదో డీల్ కుదిరినట్టు భావించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మా విధులు మాకు తెలుసు, రాజకీయ నాయకులకు కూడా వారి విధులు తెలుసని తెలిపారు. ఏ న్యాయమూర్తులు కూడా (భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తులు) ఏ ముప్పును కోరి తెచ్చుకోరని మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.‘‘ఈ సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉండడంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత దాగి ఉంది.. ఇది తెలిసిందే. న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను (బడ్జెట్) ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కాబట్టే సీఎంలతో సమావేశాలు తప్పనిసరి. ఈ బడ్జెట్ న్యాయమూర్తుల కోసం కాదు. కొత్త కోర్టు భవనాలు, జిల్లా న్యాయమూర్తులకు కొత్త నివాసాలు అవసరం. దీనికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి సమావేశాలు అవసరం. ఇలాంటి సమావేశాలు న్యాయ నిర్ణయాలపై కాకుండా న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తాయి.తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ‘ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటికి వెళతారు. అప్పుడు, ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ఇంటికి వస్తారు, ఈ సమావేశాలు ఎజెండాను నిర్ణయిస్తాయి. జడ్జిలతో జరిగిన సమావేశంలో ఏ సీఎం కూడా పెండింగ్ కేసుల ప్రస్తావన తేలేదు. జడ్జీలతో జరిగే మీటింగ్స్‌లో రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వతతో వ్యవహరించింది. దీని కోసం మీరు కలవాల్సిన అవసరం లేదా? కేవలం లేఖలు పంపి ఊరుకుంటే పనులు కావు. న్యాయమూర్తులు నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది.’ అని తెలిపారు. -
వినాయకుని పూజలో వైఎస్ అవినాష్ రెడ్డి
-
పూణే దగ్దుసేథ్ గణపతి ఆలయంలో మోదీ పూజలు
-
శాకంబరీ నమోస్తుతే
వర్గల్: విద్యాధరిలో సరస్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి అమ్మవారు శుక్రవారం శాకంబరీ దేవి అలంకారంలో సాక్షాత్కరించారు. నేత్రపర్వంగా సాగిన మూలా మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులు శాకంభరీ మాత దివ్య మంగళ రూపంతో దర్శనమివ్వడంతో అశేషజనం భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. చదువుల తల్లి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మ, బాల ఉమామహేశ్వర శర్మల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం క్వింటాళ్ల కొద్దీ కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆషాఢ మాసంలో శాకంభరీగా కొలువుదీరిన అమ్మవారిని స్తుతిస్తూ సప్తశతీ పారాయణాలు చేసారు. మరోవైపు వేద విద్యార్థులు లలితా సహస్ర పారాయణాలు జరిపారు. ఆలయ యాగ మండపంలో చండీహోమం నిర్వహించారు. ఓ వైపు శాకంబరీ దేవిగా అమ్మవారి దివ్యమంగళ రూపం, మరోవైపు విశేష అర్చనలు, యాగాది కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోయారు. నేత్రపర్వంగా సాగిన మూల మహోత్సవ వేడుకలు తిలకించేందుకు స్థానిక జిల్లా భక్తులతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వర్గల్ క్షేత్రానికి తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ మేనేజర్ రఘుపవన్ పర్యవేక్షించారు. -
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైలంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఈఓ చంద్రశేఖర అజాద్ అంకురార్పణ చేశారు. ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతిపూజ, చండీశ్వరపూజ తదితర విశేష పూజలను ఈఓ దంపతులు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేశారు. 18వ తేదీ వరకు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు స్వామిఅమ్మవార్ల ఆర్జితకల్యాణోత్సవం, రుద్రహోమం, గణపతి, మహామృత్యుంజయ తదితర హోమాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వారం రోజుల పాటు విశేష వాహనసేవలు, ప్రతిరోజూ గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సంక్రాంతి పర్వదినాన శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ అజాద్ తెలిపారు. -
ఘనంగా ప్రారంభమైన కాణిపాకం బ్రహ్మోత్సవాలు
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆలయంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 నుంచి 8గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. అనంతరం ధ్వజ స్తంభానికి క్షీర, చందనద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి ప్రత్యేక పూజలు జరిపి ధ్వజ స్తంభాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం కాణిపాకం పురవీధులలో మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అన్వేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 108 కలశాలను ఉంచారు. అందులో పుట్టమన్ను, నవధాన్యాలు వేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ నిర్వహిం చారు. బ్రహ్మోత్సవాల బాధ్యతలు నిర్వహించే ఈవో పూర్ణచంద్రరావుకు ఆలయ ప్రధాన అర్చకులు రక్షా బంధన కంకణాన్ని తొడిగారు. హంస వాహనంపై గణనాథుడు బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి గణనాథుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీర్కరుణీకర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. మందుగా స్వామివారి మూలవిరాట్‌కు ఉభయదారులతో ప్రత్యేక అభిషేకం నిర్వహిం చారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో ముందు గా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆదికేశవపిళ్లై, ఏసీ గురుప్రసాద్, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, సూపరింటెం డెంట్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.