gang rape on girl
-
నగ్నంగా రోడ్డుపై గ్యాంగ్‌రేప్ బాధితురాలు.. ఆపై దిమ్మతిరిగే ట్విస్ట్!
లక్నో: సంచలనం సృష్టించిన వైరల్ వీడియోపై దిమ్మతిరిగిపోయే ప్రకటన ఇచ్చారు పోలీసులు. నగ్నంగా నడిరోడ్డుపై నిస్సహా స్థితిలో నడుచుకుంటూ వెళ్లిన అమ్మాయి(15) అత్యాచార బాధితురాలు కాదని, అసలు ఆమెపై అత్యాచారం జరగలేదని, వైద్య పరీక్షలోనూ అది నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ సైతం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోరాదాబాద్ వైరల్ వీడియోపై యూపీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగ్నంగా ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియో అది. పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టి.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వైరల్ వీడియోలో ఉంది తన కుటుంబానికి చెందిన వ్యక్తే అని, ఆమె బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తస్రావంతో ఆమె ఇంటికి చేరిందని, ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగిందని అందులో పేర్కొన్నాడు. భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 1వ తేదీన అఘాయిత్యం జరగ్గా.. 7న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ఐదుగురిని అరెస్ట్ కూడా చేసి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే.. వైద్య పరీక్షలో బాధితురాలిపై అఘాయిత్యం జరిగినట్లు రుజువు కాలేదు. అయినప్పటికీ కేసులో దర్యాప్తు కొనసాగించారు పోలీసులు. ఈ లోపు.. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. తమ కూతురిపై అసలు సామూహిక అత్యాచారం జరగలేదని, చిన్నప్పటి నుంచి మానసిక సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడుతోందని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ఎవరూ ఊహించని మలుపు తిరిగినట్లయ్యింది. అత్యాచారం జరగకుంటే.. ఆమెను ఆకతాయిలు వేధించి దుస్తులు విప్పించి నడిరోడ్డుపై నడిపించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపు నడిరోడ్డుపై నగ్నంగా ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే సాయం చేయాల్సిందిపోయి.. వీడియోలు తీసి వైరల్ చేసిన యువకుల తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. Warning: Disturbing details ahead -
పాతబస్తీలో దారుణం.. కిడ్నాప్ చేసి ఓయో రూమ్‌లో గ్యాంగ్ రేప్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్ చేసిన, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్ మైనర్ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. దబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఓ మైనర్ మెడికల్ షాపునకు వెళ్లిందేకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో ఇద్దరు యువకులు.. ఆమెను కిడ్నాప్ చేసి అదే ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్ రూమ్‌కు తరలించారు. అక్కడే రెండు రోజులు ఉంచి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలని చాదర్‌ఘాట్ వదిలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఇంటికి తీసుకువెళ్లారు. కాగా, అత్యాచారం సందర్భంగా బాధితురాలికి మత్తు మందు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాధితురాలు కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను రవేష్ మెహదీ, మహ్మదుల్లాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కిడ్నాప్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ, ఓయో రూమ్‌కు తరలిస్తున్న ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, బాధితురాలు మైనర్ కావడంతో భరోసా సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే బాధితురాలు, ఆమె పేరెంట్స్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం
బనశంకరి (బెంగుళూరు): పొరుగింటి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీణ్యాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పొరుగింటికి చెందిన బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతను నిత్యం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను కలిసేవాడు. పాఠశాల ముగిసిన అనంతరం బాలికను హోటల్‌కు, ఇతర స్ధలాలకు తీసుకెళ్లి సరదాగా తిప్పేవాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో ఈ నెల 8న బాలికను నమ్మించి సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన అనంతరం బాలికను పీణ్యాలో నిర్మాణదశలో ఉన్న ఓ కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడికట్టాడు. అనంతరం తన స్నేహితులిద్దరిని పిలిపించుకొని ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఆమె ఇంటికి వెళ్లింది. తల్లికి విషయం తెలిస్తే మందలిస్తుందనే భయంతో బాలిక స్నేహితురాలి ఇంట్లోనే 5 రోజులు గడిపింది. కూతురు ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లి తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పీణ్యా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లి ముందు జరిగిన అకృత్యాన్ని తెలిపింది. దిగ్భ్రాంతికి గురైన తల్లి మళ్లీ పీణ్యాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ముగ్గురు మైనర్ బాలురును అరెస్ట్ చేసి బాలల పరివర్తనా కేంద్రానికి తరలించారు.