వైభవంగా గంగమ్మతల్లి బోనాలు
కరీంనగర్ కల్చరల్ : డప్పుచప్పుళ్లు, పూనకాలు, వేపమండలు, తలపై బోనాలతో కరీంనగర్లో ఆదివారం గంగమ్మ బోనాలు వైభవంగా సాగాయి. నగరంలోని వివిధ కాలనీలకు చెందిన గంగపుత్ర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ బోనాల జాతరలో గంగపుత్ర కులస్తులు, మహిళలు నెత్తిన బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మానేరు జలాశయం వద్ద గల గంగమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన పూజల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ శంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.