gangavati
-
సున్నితమైన ప్రేమకథ
తెలుగబ్బాయి రవీంద్ర తేజ ‘గంగావతి’ అనే కన్నడ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఓ తెలుగు చిత్రం కూడా చేయనున్నాడు. ‘సాయే దైవం’ ఫేం జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాయుడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు ఈ చిత్రం నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇది సున్నితమైన ప్రేమకథ. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి రచన–సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వై.రఘురామ్, సమర్పణ: ముళ్ళగూరు లక్ష్మీదేవి. -
మోదీ ఫొటో మార్ఫింగ్.. యువకుడి అరెస్టు
ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి, తన ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్న ఓ యువకుడిని కర్ణాటకలోని గంగావతి పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ మహబూబ్ (25) అనే ఈ యువకుడు.. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కాళ్ల మీద ప్రధాని నరేంద్రమోదీ పడుతున్నట్లు ఉన్న ఫొటోను తయారుచేసి, దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐపీ నెంబరు ఆధారంగా, గంగావతిలోని ఓ నగల దుకాణంలో పనిచేసే మహ్మద్ ఈ పనికి పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నారు. అతడే ఈ ఫొటోను తయారుచేశాడా, లేక తన ఫేస్బుక్ ఖాతాకు వేరే ఎవరైనా షేర్ చేశారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి మృతి
గంగావతి, న్యూస్‌లైన్ : బైక్‌ను ఆటో ఢీకొనడంతో గాయపడిన ఇద్దరు యువకులు నాలుగు రోజుల అనంతరం మంగళవారం బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత శుక్రవారం కొప్పళ నుంచి గంగావతికి వస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న ఆటో దాసనాళ బ్రిడ్జ్ సమీపంలో ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మల్లికార్జున (34), భీమిరెడ్డి(36)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గంగావతి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వారిద్దరినీ మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. అయితే వారు బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేయాలని వారి బంధువులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిరాకరించడంతో మృతదేహాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసనకు ప్రయత్నించారు. ముందుగా ఆ విషయాన్ని గ్రహించిన పోలీసులు హొసళ్లి వద్ద అడ్డుకున్నారు. వారి బంధువుల విన్నపం మేరకు డీఎస్పీ కేసు నమోదుకు అంగీకరించగా ఆందోలనను విరమించుకుని తమ సొంత గ్రామం కనకగిరికి వెళ్లిపోయారు. -
ఉప లోకాయుక్త సుడిగాలి పర్యటన
గంగావతి, న్యూస్‌లైన్ : కర్ణాటక రాష్ట్ర ఉప లోకాయుక్త బృందం గురువారం గంగావతి తాలూకాలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులు, హాస్టల్, ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించింది. గురువారం ఉదయం తాలూకాలోని సంగాపుర, రామదుర్గ, బసవనదుర్గ, కురిహట్టి క్యాంప్‌లలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఉప లోకాయుక్త శశిధర్ మజిగె పరిశీలించారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కాంపౌండ్ గోడలు, గ్రామాల్లో నిర్మించిన డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నగరంలోని బీసీఎం హాస్టల్లోకి ప్రవేశించి హాస్టల్ మరుగుదొడ్లు, వంటగది విద్యార్థుల గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఆహారం సరిగా అందుతోందా? వసతులు సరిగా ఉన్నాయా? తాగునీటి సదుపాయం ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి రిజిస్టర్‌ను పరిశీలించారు. మహిళల కాన్పులకు సంబంధించిన ఫైళ్లను చూసి మడిలు కిట్లను సరైన రీతిలో అందించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని రోగుల వార్డులను సందర్శించి సరైన రీతిలో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారా?అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనకగిరి తదితర గ్రామాలకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించి కుష్టిగి తాలూకాలో ప్రవేశించారు. ఉప లోకాయుక్త వెంట కొప్పళ డీవైఎస్పీ ఎస్కే. మురనాళ్, లోకాయుక్త సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీంబాషా, గంగావతి తహ శీల్దార్ గంగన్న, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎస్ఎన్. మఠద్, నగరసభ కమిషనర్ నింగన్న కుంబణ్ణనవర్, స్థానిక టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జ్యోతిబా నిక్కం, ప్రభుత్వ ఆస్పత్రి పాలక మండలి అధికారి డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.