Ganta srinivasa
-
మంత్రి గంటా కారును ఆడ్డుకున్న స్థానికులు: పదిమంది అరెస్ట్
-
నాలెడ్జ్ హబ్‌గా ఏపీ : గంటా
రాంబిల్లి: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రాంబిల్లిలో కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థలో సం స్కరణలు తీసుకువస్తామని చెప్పారు. కస్తూ ర్బా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి 17 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ము త్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పోటీతత్వంతో విద్యార్థులు చదవాలని సూచించారు. కాగా, కస్తూర్బా భవన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నట్లు కన్నబాబు సభలో మంత్రి గంటా, ఎమ్మెల్యే పంచకర్ల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీపీ వసంతవాడ వెంకటేశ్వరరావు, సర్పం చ్ పిన్నంరాజు రాధాసుందర సుబ్బరాజు (కిషోర్), డీఈఓ కృష్ణారెడ్డి, సర్వశిక్ష అభియాన్ పీఓ బి.నగేష్, మండల ప్రత్యేకాధికారి పి.కోటేశ్వరరావు, తహశీల్దార్ మల్లేశ్వరరావు, ఎంపీడీఓ స్వరూపరాణి, ఎంఈఓ ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఓ జూనియర్ కళాశాల అచ్యుతాపురం: నియోజకవర్గానికి ఓ జూని యర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రామన్నపాలెంలో సుజలస్రవంతి పథకాన్ని ప్రారంభించారు. అచ్యుతాపురం కూడలిలో రోడ్లు ఊడ్చారు. మోసయ్యపేట గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించారు. అనంతరం దిబ్బపాలెం ఎస్ఈజెడ్ కాలనీ జన్మభూమి సభలో మాట్లాడారు. ఎస్ఈజెడ్ సమస్యలపై అధ్యయనం చేశామని, నిర్వాసితులకు నైపుణ్యం లేనికారణంగా ఉపాధికి దూరమవుతున్నారని చెప్పారు. నిర్వాసితుల న్యా యమైన కోర్కెలు పరిష్కరిస్తామని చెప్పారు. అచ్యుతాపురంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో లాలం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఒప్పుకోవద్దు
సీఎం నిర్ణయంపై మంత్రి గంటా, విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి విశాఖపట్నం: విశాఖజిల్లా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయానికి స్వపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాక్సైట్ తవ్వకాలు వ్యతిరేకించి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సమ్మతిస్తే ప్రజల్లో అభాసుపాలవుతామని సొంత పార్టీ మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.మన్యంలో మళ్లీ మావోయిస్టులు బలపడేందుకు స్వయంగా ప్రభుత్వమే పూనుకున్నట్లు అవుతుదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధిపై చర్చించడానికి మంత్రి గంటాశ్రీనివాసరావు ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇందులో ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించి నిర్ణయం ఉపసంహరించేలా చేయాలని తీర్మానించారు. ‘విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పోరాటం చేసింది మనమే. ఇప్పుడు ్ల గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మనమే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి సీఎం బాబును కలుద్దాం.తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా ఒప్పిద్దాం. వాస్తవాలు వివరించకపోతే ఆతర్వాత నష్టపోయేది మనమే’.. అంటూ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో గంటాకు వివరించారు. దీంతో ఆయనకూడా నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. భేటీకి మంత్రి అయ్యన్న లేకున్నా ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకువచ్చారు. -
ముగిసిన ‘మూడో విడత’
సాక్షి, విశాఖపట్నం : ప్రజల నిరసనలు, ఆందోళనల నడుమ మూడో విడత రచ్చబండ ముగిసింది. భీమిలిలో నవంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం వరకు మొక్కుబడిగానే సాగింది. ప్రజలకు ప్రయోజనమివ్వని కార్యక్రమంగా మిగిలి పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వచ్చేందుకు వేదికయింది. విస్తృత బందోబస్తు, విపరీత ఆంక్షల నడుమ ఈ సభలను అధికారులు, అధికారపార్టీవారు మమ అనిపించారు. సమస్యలపై ప్రశ్నించే వారిని అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ సభలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల కోసం 62,059 , పింఛన్ల కోసం 28,482, ఇళ్ల కోసం 59,989 దరఖాస్తులొచ్చాయి. రేషన్‌కార్డులలో వయస్సు మార్పు కోసం మరో 1198 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీని నిర్వహణకు మండలానికి రూ.70వేలు చొప్పున ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదు. నవంబర్ 15న చోడవరంలో జరిగిన సభలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావులకు సభల్లో నిరసనలు ఎదురయ్యాయి. పాడేరు సభలో పెంచిన పరీక్ష ఫీజులను రద్దు చేయాలని విద్యార్థులు, బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మంత్రి బాలరాజు ఎదుట నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకెళ్ళేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని కొండకుమ్మర్లు మంత్రిని నిలదీశారు. అనకాపల్లి సభలో మంత్రి గంటా శ్రీనివాసరావుకూ నిరసనలు తప్పలేదు. ఇక్కడ సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన 54మంది టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురయింది. యలమంచిలి మండలం పీఎన్ఆర్పేట కార్యక్రమంలో ఇందిరమ్మ బిల్లు అందలేదంటూ మొగ్గా అప్పారావు అనే లబ్ధిదారుడు ప్రస్తావించగా ఎమ్మెల్యే కన్నబాబు సహనం కోల్పోయి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబుపాలెం సభలో వేదికపైకి ఎందుకు తనను ఆహ్వనించలేదని గ్రామ సర్పంచ్ లంబా అప్పారావు ప్రశ్నించగా.. ‘ఇది అధికారుల సభ అని,పిలవాల్సిన అవసరం లేదని, ఇదే నా స్టయిల్ ’ అని దురుసుగా మాట్లాడారు. క్రషర్ డీడీ చార్జీలను విపరీతంగా పెంచడంపై తిమ్మరాజుపేటలో పలువురు రైతులు ఎమ్మెల్యే కన్నబాబును నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అరకులోయలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే సోమ ప్రసంగాన్ని ఏపీ గిరిజన సంఘం సభ్యులు అడ్డుకున్నారు. గత రచ్చబండలో ఇచ్చిన వినతులను ఇప్పటికీ ఎందుకు పరిష్కరించలేదని నిలదీసిన గిరిజన సంఘం ప్రతినిధులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కశింకోట సభకు మంత్రి గంటా హాజరు కాకపోవడంతో స్థానికులు అధికారుల్ని నిలదీశారు. -
గిన్నిస్ రికార్డ్సులో ‘విశాఖ ఒలింపిక్’ ఖ్యాతి
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖలో జూన్ 23వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ఒలింపిక్ డే రన్’కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం లభించింది. పరుగులో పాల్గొన్న 86,549 మందికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుకోనున్నారు. ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో సంస్థ ఇచ్చిన రికార్డు గుర్తింపు పత్రాన్ని చదివి వినిపించారు. విశాఖ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని కార్యక్రమాలకు విశాఖ వేదికగా నిలిచి విశేష గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సర్టిఫికెట్ పొందవచ్చని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు హర్షవర్థన్ ప్రసాద్ తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం హర్షించదగ్గ విషయమని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ అన్నారు. కార్యక్రమానికి విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి గణపతిరావు, ఉపాధ్యక్షుడు శంకరరావు, సంయుక్త కార్యదర్శి లలిత్‌కుమార్, ప్రతినిధి రవీంద్ర, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేరుతోనూ సర్టిఫికెట్ పొందచ్చు వాస్తవంగా ఈ పరుగులో 98 వేల మంది పాల్గొన్నారు. పరుగు ప్రారంభంలో జరిగిన తొక్కిసలాటలో ప్రారంభ బాక్సులో వేసిన కొన్ని ఫాయిల్స్ పాడవడంతో వాటిని లెక్కించలేదు. దీంతో 86,549 మంది మాత్రమే రికార్డుకు నోచుకున్నారు. మిగిలిన బాక్సులో టికెట్టు ఫాయిల్స్ వేసిన వారికి సర్టిఫికెట్లను అందించేందుకు గిన్నిస్ బుక్ అనుమతినిచ్చిందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ తెలిపారు. తమ పేరుతో సర్టిఫికెట్ కావల్సిన వారు నిర్ణీత రుసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ సంఘం కార్యాలయంలో రూ.300 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం నుంచి సర్టిఫికెట్లు ఒలింపిక్ డే రన్లో పాల్గొన్నవారు సర్టిఫికెట్లను బుధవారం నుంచి అందించేందుకు జిల్లా ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసింది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం రూమ్ నంబర్-6లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో పొందవచ్చు. రన్లో పాల్గొన్నప్పుడు ఇచ్చిన నంబర్ కార్డును తమతో తెచ్చుకోవల్సి ఉంటుంది. ఆ నంబరును పరిశీలించి సర్టిఫికెట్‌ను నిర్వాహకులు అందించనున్నారు. ఒలింపిక్ సంఘానికి సొంత భవనం విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘానికి సొంత భవనం ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. సంఘం పేరిట సొంత స్థలం ఉంటే నిర్మాణానికి కొందరు ముందుకు వచ్చారని చెప్పారు. త్వరలోనే ఆ ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.