ganza
-
HYD: యూట్యూబర్ ప్రణీత్ హన్మంతుపై గంజాయి కేసు
సాక్షి,హైదరాబాద్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌పై గoజాయి కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసినందుకుగాను ప్రణీత్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.ప్రణీత్ గంజాయి సేవించినట్టు తాజాగా మెడికల్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్లను పోలీసులు జోడించారు. ఇప్పటికే ప్రణీత్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఇతడిని మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది. -
Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్
బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. అన్న కోసం వెళ్తే.. అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. -
ఏపీలో భారీగా గంజాయి దహనం
-
పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!
బీజింగ్: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ప్రస్తుతం లభించిన డైనోసార్ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ ఫియాన్వైసుమ్ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్‌లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్ ఐసైన్స్లో ప్రచురించారు. బేబీ ఇంగ్లియాంగ్ విశేషాలు ► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు. ► జాతి: ఒవిరాప్టోరోసారస్(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం) ► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే) ► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు. ► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా). -
రూ.7 కోట్ల గంజాయి పంటకు నిప్పు
సాక్షి, మల్కన్‌గిరి: చిత్రకొండ సమితి తర్లకోట పంచాయతీ కొల్లాగుడ గ్రామ సమీప అడవుల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను బలిమెల ఐఐసీ సుమిత్రా జెన్నా సిబ్బందితో వెళ్ళి ధ్వంసం చేశారు. కొల్లాగుడ అడవుల్లో మావోయిస్టుల సహకారంతో గిరిజనులు సుమారు 15 ఎకరాల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. మావోయిస్టుల ప్రభావంతో ఆ ప్రాంతానికి ఇదివరలో ఎవరూ వెళ్లేవారు కాదు. అయితే ఇటీవల పోలీస్ దళాలు కూంబింగ్ విస్తృతంగా నిర్వహిస్తుండడంతో వారి కంటబడుతున్న గంజాయి తోటలను గుర్తించి సమచారం తెలియజేస్తుండడంతో అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది దాడి చేసి గంజాయి మొక్కలను కాల్చి ధ్వంసం చేస్తున్నారు. ఎన్నోసార్లు గిరిజనులను హెచ్చరిస్తున్నా మావోయిస్టుల అండతో గంజాయి సాగును యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస దాడులతో సుమారు రూ.15కోట్ల విలువైన సాగును ధ్వంసం చేశారు. శుక్రవారం కాల్చివేసిన గంజాయి సాగు విలువ సుమారు రూ.7 కోట్లు ఉండవచ్చని పోలీస్ అధికారి తెలియజేశారు. -
300 కిలోల గంజాయి స్వాధీనం
-
300 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నంలో భారీ మొత్తంలో గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 300 కిలోల గంజాయిని వారు గుర్తించారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అరకు, పాడేరు మండలాల నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో దాడి చేశారు. 20 బస్తాలలో పట్టుబడిన ఈ గంజాయి విలువ దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని వారు అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నట్లు ఎప్పటినుంచో చెబుతున్నా, ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడూ పట్టుకోలేదు. అయితే, దీని వ్యాపారులు తమకు ఈ గంజాయి ఇచ్చి, ఔరంగాబాద్‌లో అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్పారని, అంత చేసినందుకు తమకు 15వేల రూపాయలు మాత్రమే వస్తాయని నిందితులు చెప్పారు.