Gardeners farmers
-
టవర్ గార్డెన్ భేష్!
తక్కువ స్థలంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలనే కాదు కషాయాల కోసం అనేక రకాల ఔషధ మొక్కలను సైతం పెంచుకోవడానికి వీలు కల్పించే ఉపాయం ‘టవర్ గార్డెన్’. దీన్నే వర్టికల్ గార్డెన్, వర్టికల్ టవర్ అని కూడా పిలుచుకోవచ్చు. 2 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి చుట్టూతా 60 ప్యాకెట్లు ఉంటాయి. వాటిల్లో 60 మొక్కలు పెంచుకోవచ్చు. బాల్కనీలలో, మేడ పైన, ఇంటి ముందు, ఇంటి వెనుక కొద్దిపాటి ఖాళీ ఉన్నా టవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ఇందులో మొక్కలు చక్కగా పెరిగి దిగుబడినివ్వాలంటే కనీసం 3 గంటలు ఎండ తగిలే చోటులో దీన్ని పెట్టుకోవాలి. టవర్ గార్డెన్లను పెట్టుకున్న ఇద్దరు హైదరాబాద్ వాసుల అనుభవాలు ఈ వారం ‘ఇంటిపంట’ పాఠకులకు ప్రత్యేకం.. ఒక్కో టవర్ చుట్టూ 60 మొక్కలు మా మిద్దె తోటలో టవర్ గార్డెన్లో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుకుంటున్నాం. ఆకుకూరలను తినడంతోపాటు ఔషధ మొక్కలతో కషాయాలను తాగడం వల్ల కుటుంబం అంతా ప్రయోజనం పొందగలుగుతున్నాం. మా మిద్దె తోటలో ఆరు టవర్ గార్డెన్లు ఉన్నాయి. ఒక్కో టవర్‌కు చుట్టూతా, పైన కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ ఆకుకూరలు, కషాయాల కోసం గ్రీన్స్, మెడిసినల్ ప్లాంట్స్‌కు కొరత ఉండకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి. సదాపాకు కషాయం, గోంగూర కషాయం, పుదీనా కషాయం, మెంతికూర, కొత్తిమీర, పునర్నవ (గలిజేరు), తమలపాకు, తిప్పతీగ, గోధుమ ఆకులు, నల్లేరు, 5 రకాల తులసి (రామ తులసి, జింజిర్ తులసి, లవంగ తులసి, కర్పూర తులసి, మింట్ తులసి), కరివేపాకు, ఉత్తరేణితో పాటు జామ, మామిడి, వేప, రావి, గానుగ, పారిజాతం మొక్కలను కూడా పెంచుకొని వంటల్లోనూ, కషాయాలలోనూ వాడుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్నాం. వీటితో పాటు ఖాదర్ గారు చెప్పిన ఐదు రకాల సిరిధాన్యాలను తింటున్నాం. తిన్న అందరిలోనూ మార్పు స్పష్టంగా కనపడుతున్నది. స్థలాభావం ఉన్న ఆరోగ్య ప్రియులందరూ మిద్దె మీద టవర్ గార్డెన్లో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది. – బి. రవిచంద్రకుమార్(95812 42255), బ్యాంకు కాలనీ, హైదరాబాద్ వర్టికల్ టవర్‌లో పుష్కలంగా ఆకుకూరలు నాలుగు నెలల క్రితం మా మేడ మీద ఒకటి, ఇంటి వెనుక ఖాళీలో మరొకటి వర్టికల్ టవర్స్ పెట్టాం. టవర్ చుట్టూ 10 ప్యాకెట్లలో తెల్లగలిజేరు, కొన్ని ఎర్ర గలిజేరు మొక్కలు పెట్టాను. తోటకూర, గోంగూర, పాలకూర, చెన్నంగి, పొన్నగంటి, మెంతికూరలు కొన్ని ప్యాకెట్లలో విత్తుకున్నాను. తెల్లగలిజేరు 2 నెలల పాటు వరుసగా పప్పులో వేసుకోవడానికి కొరత లేకుండా వచ్చింది. డా. ఖాదర్ గారు చెప్పినది విన్న తర్వాత గలిజేరు కషాయం కూడా కొన్నాళ్లు తాగాం. నాటు తోటకూర రెండే మొక్కలు ఉన్నా.. వారానికోసారి కూరకు సరిపడా వస్తున్నాయి. విత్తిన పది రోజుల్లోనే మెంతికూర వచ్చింది. 20 రోజులకు పాలకూర రావడం ప్రారంభమైంది, ఇప్పటిMీ వారానికోసారి పుష్కలంగా వస్తోంది. వర్టికల్ టవర్ పైభాగాన 3 వంగ మొక్కలు పెట్టాను. వారానికో కిలో చొప్పున కాయలు వచ్చాయి. ఈ వర్టికల్ టవర్ మధ్యలో నిలువుగా ఉన్న గొట్టంలో వంటింటి వ్యర్థాలను వేస్తూ వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నాను. రెండు నెలలకు ఒక కిలో కంపోస్టు వచ్చింది కూడా. వంటింటి వ్యర్థాలను నేరుగా ఇందులో వేయకూడదు. తడి చెత్త, పొడి చెత్తను కలిపి వేస్తే మంచిది. లేదంటే.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తొక్కలను వేరే పాత్రలో వేస్తూ 20 రోజుల తర్వాత సగం కుళ్లిన వ్యర్థాలను తీసి ఈ టవర్‌లో వేసి, కొన్ని వానపాములను వేస్తే చాలు. – నోరి శైలజ (99483 36508), సన్‌సిటీ, కీర్తి రిచ్మండ్ విల్లాస్, లంగర్‌హౌజ్, హైదరాబాద్ -
సగం మందికే రుణమాఫి
► ఉద్యానవన రైతులు, మత్స్య, పౌల్ట్రీ, డెయిరీ, ఎరువుల లోన్లకు మాఫీ వర్తించదట ►పడమటి ప్రాంతాల్లో ఉద్యానవన పంటలే అధికం ►ప్రభుత్వ నిబంధనలతో లబోదిబోమంటున్న అన్నదాతలు పలమనేరు: చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ చట్రంలో ఇరుక్కుని రైతులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేస్తూ రుణమాఫీలో షరతుల పేరిట మాఫీ భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఫలితంగా అర్హులైన రైతులు సైతం రుణమాఫీ పొందలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యానవన రైతులకు మాఫీ వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. తద్వారా తాము ఏమి పాపం చేశామంటూ ఆయూ పంటలు సాగుచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలే అధికం పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సాగు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టమాట ఎక్కువగా సాగవుతోంది. పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో మాత్రం అన్ని కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఇక 20 శాతం వరకు రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీరందరూ హార్టికల్చర్ కిందకే వస్తారు. ఈ ప్రాంతంలో మత్స్య కార సహకార సంఘాలు సైతం 80కి పైగానే ఉన్నాయి. పలమనేరు, గంగవరం మండలాల్లో జిల్లాలోనే అధికంగా కోళ్ల రైతులున్నారు. మరోవైపు పాడిఆవుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందే రైతులు ఇక్కడ 50 శాతం మంది ఉన్నారు. వీరందరూ వారి అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. వీరందరికీ రుణమాఫీ వర్తించదట టమాట సాగుచేసే రైతులు పంట రుణాలు పొందారు. మరికొందరు 10(1), అడంగల్‌లో టమాట సాగును చూపెట్టి బంగారు రుణాలు తీసుకున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో పది రకాల కూరగాయల పంటల సాగు కోసం రైతులు వివిధ బ్యాం కుల్లో రుణాలు తీసుకున్నారు. పాడి రైతులు పలు బ్యాంకుల్లో మినీ డెయిరీ పేరిట(నాలుగు పాడి ఆవుల కొనుగోలుకు రుణం పొందవచ్చు)రుణాలు పొందారు. మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలోనూ సహకార సంఘాల్లో రు ణాలు తీసుకున్నారు. మరికొందరు సంబంధిత సింగిల్‌విండోల్లో ఎరువుల కొనుగోలు కోసం రుణాలు తీసుకున్నారు. జిల్లా మొత్తం మీద 8.7 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్ల పంట రుణాలు పొందారు. ఒక్క మదనపల్లె డివిజన్‌లోనే ఉద్యానవన పంటల సాగు కోసం రైతులు బ్యాంకు నుం చి తీసుకున్న రుణం దాదాపు రూ.80 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. ఇ వన్నీ మాఫీ పరిధిలోకి రానట్టే. లబోదిబోమంటున్న రైతులు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్(జీవో ఎంఎస్ నం.174)లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టమాట రైతుల్లో అయోమయం నెలకొంది. రుణాలు మాఫీకాకపోతే వడ్డీ సహా తీర్చడం తలకుమించిన భారంలా మారడం ఖాయం. బా ధిత రైతులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకన్నా నమ్మక ద్రోహముందా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు ఈ మాట చెప్పుంటే బాగుండు. అన్ని రుణాలు మాఫీ అని హా మీ ఇచ్చి ఇప్పుడు సవాలక్ష రూల్స్పెట్టి రైతుల నోర్లు కొట్ట డం మంచిది కాదు. ఇంతకన్నా నమ్మక ద్రోహం మరొకటి ఉంటుందా. -శేషేగౌడు, చీలంపల్లె, బెరైడ్డిపల్లె మండలం చెరుకు రైతులకే రుణమాఫీ వర్తిస్తుందంటే ఎట్టా ఈ ప్రాంతంలో చెరుకుసాగు పూర్తిగా తగ్గింది. సగానికి పై గా రైతులు టమాట, పలు కూరగాయలను సాగుచేస్తున్నా రు. వాటికోసమే బ్యాంకులో అప్పులు తీసుకున్నాం. ఇప్పు డు వాటికి రుణమాఫీ చేయడం కుదరదంటే ఎంతవరకు న్యాయం. -మోహన్‌రెడ్డి, మేకల నాగిరెడ్డిపల్లె, బెరైడ్డిపల్లె రుణమాఫీ ఓ ట్రాష్ ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో రుణమాఫీని పెట్టినట్టు అందరికీ తెలిసిపోయింది. రూ.1.5 లక్షల రుణమాఫీలో లే నిపోని రూల్స్ పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టేది అవసరమా. దీనికన్నా మావల్ల చేతకాదంటూ ఈ ప్రభుత్వం రుణమాఫీ ని వదిలేస్తే పోలా. -రవి, కూర్మాయి, పలమనేరు