Garry Kirsten
-
మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్..
ICC ODI World Cup 2023: జట్ల విజయాల్లో కోచ్‌ల పాత్రపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌లు పేరుప్రఖ్యాతులు పొందాలన్నా, విమర్శలపాలైనా.. అంతా ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. తాము 2011లో ప్రపంచకప్ గెలిచి గ్యారీ కిర్‌స్టన్‌కు కోచ్‌గా పేరు సంపాదించిపెట్టామని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల సందర్భంగా మంగళవారం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు అంశాలపై మాట్లాడిన వీరూ భాయ్.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. బాగా ఆడితే పూలు.. లేదంటే రాళ్లు ‘‘ఒక్కసారి ఆటగాళ్లు మైదానంలోకి దిగిన తర్వాత కోచ్ భవిష్యత్తు వారి ఆటతీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సదరు ప్లేయర్ బాగా ఆడితే కోచ్‌కు ప్రశంసలు దక్కుతాయి. లేదంటే విమర్శలు తప్పవు. భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. కానీ ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడరు. అయితే, ఫైనల్లో ఓడిన విషయం గురించి మాత్రం పదే పదే చర్చిస్తారు. ప్రతిఒక్కరు విమర్శలు గుప్పిస్తారు. మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. మరి ద్రవిడ్ నిజానికి రాహుల్ ద్రవిడ్ మంచి కోచ్. కానీ కోచ్‌లు ఎంత గొప్పగా ఉన్నా చివరికి ఆటగాళ్ల ప్రదర్శన మీదే అంతా ఆధారపడి ఉంటుంది. 2011 వరల్డ్‌కప్ గెలిచి మేము గ్యారీ కిర్‌స్టన్‌కు మంచి పేరు తీసుకువచ్చాం. ఆ తర్వాత అతడు ఎన్నో జట్లకు కోచింగ్ ఇచ్చాడు. కానీ ఐపీఎల్ మినహా ఎక్కడా టైటిల్ గెలవలేదు. ఇప్పుడు ఆశిష్ నెహ్రా కిర్‌స్టన్ కంటే ఎక్కువే కష్టపడుతున్నాడు. టీవీల్లో మ్యాచ్‌లు చూసే వాళ్లందరికీ ఈ విషయం తెలుసు. అలా అయితే ట్రోఫీ ఎత్తడం ఖాయం ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.. టీమిండియా కోచింగ్ సిబ్బంది ఆటగాళ్ల నైపుణ్యాలపై మరింత దృష్టిసారించి వాళ్ల నుంచి 100 శాతం అవుట్‌పుట్ రాబట్టేలా చూసుకోవాలి. అదే జరిగితే టీమిండియా కెప్టెన్ వరల్డ్‌కప్ ట్రోఫీని ఎత్తడం ఖాయంగా చూస్తారు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా 2011లో గ్యారీ కిర్‌స్టన్ టీమిండియా కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనలిస్టులు ఆ జట్లే.. ఆ రెండు మాత్రం పక్కా: సెహ్వాగ్ -
కోహ్లికి బాగా కలిసొచ్చే అంశం
పుణే: కౌంటీ క్రికెట్ ఆడాలన్న విరాట్ కోహ్లి నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సమర్థించారు. ఇంగ్లాండ్ టూర్ కంటే ముందుగా ఇంగ్లీష్ మైదానాలపై ఆడటం కోహ్లికి బాగా కలిసొచ్చే అంశమని ఆయన అంటున్నారు. ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘యూకే డొమెస్టిక్ ఫార్మట్‌లో ఆడటం గొప్ప అవకాశం. కౌంటీ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందుగానే కోహ్లి ఆ ఫార్మట్‌లో ఆడితే అది బాగా కలిసొచ్చే అంశం. ఆ అనుభవం టీమిండియాకు బాగా పనికి వస్తుంది’ అని కిర్‌స్టెన్ చెప్పారు. గత ఇంగ్లాండ్ టూర్(2014)లో కోహ్లి పేలవమైన ఫామ్‌తో విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగబోయే కౌంటీ మ్యాచ్‌ల్లో భాగంగా సర్రే టీమ్ తరపున కోహ్లి బరిలోకి దిగనున్నాడు. జూన్ 9 నుంచి 12వ తేదీ వరకు మ్యాచ్‌లలో ఆడనున్నాడు. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పించినా.. కోహ్లి మాత్రం ‘ఎప్పటి నుంచో ఆడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కొరిక తీరబోతుంది’ అని తేలికగా కొట్టిపడేశాడు. కౌంటీ మ్యాచ్‌ల కారణంగా బెంగళూరులో అఫ్గానిస్తాన్(అరంగేట్రం)తో భారత్ ఆడబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి దూరం కానున్న విషయం తెలిసిందే. జూన్ చివరి వారం నుంచి మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మే 8న జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించనుంది. -
ఇకనైనా ‘డేర్’ పెరిగేనా !
ఢిల్లీ డేర్ డెవిల్స్... ఓనర్: జీఎంఆర్; కెప్టెన్: కెవిన్ పీటర్సన్ కోచ్: గ్యారీ కిర్‌స్టెన్ గత ఉత్తమ ప్రదర్శన: సెమీఫైనల్ (2008, 2009, 2012(ప్లే ఆఫ్)) కీలక ఆటగాళ్లు: పీటర్సన్, టేలర్, డుమినీ, దినేశ్ కార్తీక్, విజయ్, మహ్మద్ షమీ ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఈ సామెత ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు అతికినట్లుగా సరిపోతుంది.. ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ గత ఆరు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2008, 2009లో సెమీఫైనల్స్‌కు.. 2012లో ప్లే ఆఫ్ దశకు చేరుకున్నా అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో విసిగి వేసారిపోయిన డెవిల్స్ యాజమాన్యం జట్టులో ఉన్న ఆటగాళ్లందరినీ వదిలించుకుంది. ఆ తర్వాత వేలం పాటలో కోట్లు కుమ్మరించి మరీ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని విధంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను రూ. 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్‌ను రూ. 9 కోట్లకు, మురళీ విజయ్ రూ. 5 కోట్లకు దక్కించుకుంది. మొత్తానికి గతాన్ని మరిచిపోయి కొత్త లుక్‌తో ఐపీఎల్-7లో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను సారథిగా నియమించింది. భారమంతా కిర్స్టెన్పైనే... భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి.. విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న కిర్‌స్టెన్ తొలిసారిగా ఐపీఎల్లో కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. గతంలో భారత్ లాగే ఇప్పుడు ఢిల్లీ జట్టును కూడా విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని జీఎంఆర్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది. ఇక ఢిల్లీ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి కిర్‌స్టెన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. బలాలు... భారత క్రికెటర్లు, విదేశీ ప్లేయర్లు, దేశవాళీ ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ పీటర్సన్ సీజన్ మొత్తం అందుబాటులో ఉండటం.. విజయవంతమైన కోచ్‌గా కిర్‌స్టెన్‌కు పేరుండటం.. ఈ జట్టు బలాలు.. బలహీనతలు...: కొద్దిమంది ఆటగాళ్లు మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా ఈ జట్టుకు కొత్త.. ఇది మినహాయిస్తే డెవిల్స్‌కు పెద్దగా బలహీనతలేమీ లేవు. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, మహ్మద్ షమీ, మనోజ్ తివారీ, జయ్‌దేవ్ ఉనాద్కట్, రాహుల్ శర్మ, లక్ష్మీ రతన్ శుక్లా, సౌరవ్ తివారీ. విదేశీ క్రికెటర్లు: కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్), జీన్‌పాల్ డుమినీ, క్వింటన్ డికాక్, వేన్ పార్నెల్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, జేమ్స్ నీషామ్(న్యూజిలాండ్), నాథన్ కౌల్టర్ నైల్ (ఆస్ట్రేలియా), భారత దేశవాళీ క్రికెటర్లు: కేదార్ జాదవ్, మయంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, రాహుల్ శుక్లా, జయంత్ యాదవ్, హెచ్. ఎస్. శరత్, మిలింద్ కుమార్.