ICC ODI World Cup 2023: జట్ల విజయాల్లో కోచ్‌ల పాత్రపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌లు పేరుప్రఖ్యాతులు పొందాలన్నా, విమర్శలపాలైనా.. అంతా ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. తాము 2011లో ప్రపంచకప్ గెలిచి గ్యారీ కిర్‌స్టన్‌కు కోచ్‌గా పేరు సంపాదించిపెట్టామని పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ విడుదల సందర్భంగా మంగళవారం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు అంశాలపై మాట్లాడిన వీరూ భాయ్.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.
బాగా ఆడితే పూలు.. లేదంటే రాళ్లు
‘‘ఒక్కసారి ఆటగాళ్లు మైదానంలోకి దిగిన తర్వాత కోచ్ భవిష్యత్తు వారి ఆటతీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సదరు ప్లేయర్ బాగా ఆడితే కోచ్‌కు ప్రశంసలు దక్కుతాయి. లేదంటే విమర్శలు తప్పవు.
భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. కానీ ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడరు. అయితే, ఫైనల్లో ఓడిన విషయం గురించి మాత్రం పదే పదే చర్చిస్తారు. ప్రతిఒక్కరు విమర్శలు గుప్పిస్తారు.
మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. మరి ద్రవిడ్
నిజానికి రాహుల్ ద్రవిడ్ మంచి కోచ్. కానీ కోచ్‌లు ఎంత గొప్పగా ఉన్నా చివరికి ఆటగాళ్ల ప్రదర్శన మీదే అంతా ఆధారపడి ఉంటుంది. 2011 వరల్డ్‌కప్ గెలిచి మేము గ్యారీ కిర్‌స్టన్‌కు మంచి పేరు తీసుకువచ్చాం. ఆ తర్వాత అతడు ఎన్నో జట్లకు కోచింగ్ ఇచ్చాడు.
కానీ ఐపీఎల్ మినహా ఎక్కడా టైటిల్ గెలవలేదు. ఇప్పుడు ఆశిష్ నెహ్రా కిర్‌స్టన్ కంటే ఎక్కువే కష్టపడుతున్నాడు. టీవీల్లో మ్యాచ్‌లు చూసే వాళ్లందరికీ ఈ విషయం తెలుసు.
అలా అయితే ట్రోఫీ ఎత్తడం ఖాయం
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.. టీమిండియా కోచింగ్ సిబ్బంది ఆటగాళ్ల నైపుణ్యాలపై మరింత దృష్టిసారించి వాళ్ల నుంచి 100 శాతం అవుట్‌పుట్ రాబట్టేలా చూసుకోవాలి. అదే జరిగితే టీమిండియా కెప్టెన్ వరల్డ్‌కప్ ట్రోఫీని ఎత్తడం ఖాయంగా చూస్తారు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా 2011లో గ్యారీ కిర్‌స్టన్ టీమిండియా కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ
వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనలిస్టులు ఆ జట్లే.. ఆ రెండు మాత్రం పక్కా: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment