Gary
-
స్పైకి కథే హీరో
‘‘ఈ మధ్య ప్రేక్షకులు ఇష్టపడుతున్నది మంచి కథనే. హీరో, ఎంటర్టైన్మెంట్ ఎంత ఉన్నా కథ అనే సోల్ లేకపోతే బ్లాక్ బస్టర్ అవ్వదు. ‘స్పై’ మూవీకి కథే హీరో’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ – ‘‘సుభాష్ చంద్రబోస్‌గారి గురించి, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి, ఆ సంస్థ సేవల గురించి చాలామందికి తెలియదు. దేశానికి తెలియాల్సిన ఆ విషయాలతో పాటు వినోదాత్మకంగా ఈ మూవీ ఉంటుంది’’ అన్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఓ పార్టీకి అనుకూలంగా మీరు ‘స్పై’ చేస్తున్నారనే ప్రచారంపై మీ స్పందన అని అడగ్గా – ‘‘కృష్ణుడంటే నాకు నమ్మకం. అందుకే ‘కార్తికేయ 2’ చేశాను. ఇప్పుడు ఓ భారతీయుడిగా ‘స్పై’ చేశాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు’’ అన్నారు నిఖిల్. ‘‘డైరెక్టర్‌గా నా తొలి సినిమా నిఖిల్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు గ్యారీ బీహెచ్. ‘‘స్పై’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు చరణ్ తేజ్ ఉప్పలపాటి. సంగీత దర్శకులు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, మాటల రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. -
బీచ్‌లో బ్రిటన్ జంట పంట పండింది
లండన్: మీరు ఎప్పుడైనా బీచ్‌ల వెంట నడిచి వెళుతుంటే సువాసనలు వెదజల్లే రాళ్లు కనుకొన్నారా.. ఒక వేళ నిజంగా కనుకొన్నారో ఇక మీ దశ మారినట్లే. ఎందుకంటే బంగారం కన్నా విలువైన ఆ రాళ్లను 'వేల్ వామిట్' అంటారు. దీనికే అంబరు అనే పరిమళ ద్రవ్యము అని పేరు కూడా ఉంది. అంటే మగ తిమింగిలాల జీర్ణవ్యవస్థలో చోటుచేసుకునే రసాయన క్రియల వల్ల ఏర్పడిన ఓ మృదువైన పదార్థం దాని కడుపులో అజీర్తిగా ఉండిపోయి వాంతు చేసుకోవడం ద్వారా బయటకు వస్తుందన్నమాట. ఇలా వచ్చిన పదార్థం సముద్రంలో తేలియాడే క్రమంలో అలలతాకిడికి ఒడ్డున పడిపోతుంది. అలా పడిన ఆ రాయిలాంటి పదార్థం కేజీల్లో కూడా ఉండొచ్చు. చక్కటి సువాసన మాత్రం అది గుప్పున వెదజల్లుతుంది. అలా వెదజల్లే వేల్ వామిట్ మీకు దొరికిందా ఇక కోటీశ్వరులైపోయినట్లే. ఎందుకంటే దీనితో పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. అయితే, ఈసారి బ్రిటన్‌లో ఇద్దరుదంపతుల పంటపండింది. గ్యారీ, ఎంజెలా విలియమ్స్ అనే భార్య భర్తలు అలా మిడిల్టన్ సముద్రం ఒడ్డుగుండా నడిచివెళుతుండగా వారికి ఇది దొరికింది. అయితే, దానిని గుర్తించడం అంత తేలిక కాదని, బహుషా నిజంగా వారికి దొరికింది తిమింగలం వాంతు చేసుకోవడం ద్వారా బయటకొచ్చిన పదార్థమే అయితే, దాని విలువ కనీసం రూ.46,65,565.59(70 వేల డాలర్లు) ఉంటుందని ప్రముఖ రచయిత క్రిస్టోఫర్ కెంప్ అంటున్నారు. కాగా, ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తం వేల్ వామిట్ దొరకలేదని గతంలో 2012లో ఎనిమిదేళ్ల బ్రిటన్ విద్యార్థికి 1.3 ఫౌండ్ల వేల్ వామిట్ దొరికిందని దాని ధర 63,000 డాలర్లు ఉందని చెప్పారు. -
కష్టపడకుండా 'సొమ్ము' చేసుకుంటున్నాడు
సులభంగా డబ్బు సంపాదించాలని చాలామంది ఆశపడతారు. కొంతమంది ఇందుకోసం అడ్డదారులు కూడా తొక్కుతారు. కానీ ఈ ఫోటోలోని పెద్దాయన మాత్రం ఒక చిన్న ఐడియాతో ఏమాత్రం కష్టపడకుండా సొమ్ము చేసుకుంటున్నాడు. అది కూడా చట్టబద్ధంగానే..! అమెరికాకు చెందిన గ్యారీ అనే 60 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి తాను ఖర్చు చేసే ప్రతి డాలర్‌పైనా ''నేను చాలా పేదవాడిని. దయచేసి ఈ డాలర్ నాకు తిరిగి పంపించండి'' అని రాసి తన చిరునామా పొందుపరుస్తున్నాడు. ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయి, సగటున రోజుకు రెండు డాలర్ల చొప్పున వెనక్కి వస్తున్నాయట. కొంతమంది అతడి నోటుతో పాటు బోనస్‌గా మరికొంత కూడా పంపిస్తున్నారు. ఇలా మొత్తమ్మీద నెలకు వంద డాలర్లపైనే వెనక్కి వస్తుండటంతో గ్యారీ ఫుల్ హ్యాపీ...!