గ్యాస్ సిలిండర్ లీకై భార్య భర్తలు మృతి
గ్యాస్ సిలిండర్ లీకై ఇంట్లో మంటలు చెలరేగిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ లీకవడంతో.. మంటలు చెలరేగాయి.. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో బాణాసంచా సామాగ్రి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గిరిజాల పంచాయతి వేమగొట్టిపాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.